టిడ్కో గృహాల్లో కార్డన్ సెర్చ్
● వాహనాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నవాబుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని భగత్‌సింగ్ కాలనీ టిడ్కో గృహాల్లో ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగర ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అందులో నివాసం ఉంటున్న వివరాలను సేకరించారు. వారి ఆధార్‌కార్డులను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఫిన్స్ సాయంతో వేలిముద్రలు సేకరించారు. వాహనపత్రాల్లేని 24 మోటార్‌బైక్‌లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్‌లకు ప్రజలు సహకరించాలని పోలీసు అధికారులు కోరారు. ప్రజలు తమవంతు బాధ్యతగా అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగంపై డయల్ 112, స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నవాబుపేట సంతపేట, దర్గామిట్ట, వేదాయపాళెం, బాలాజీ నగర్ ఇన్‌స్పెక్టర్లు జి.వేణుగోపాల్‌రెడ్డి, వైవీ సోమయ్య, బి.కల్యాణరాజు, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అల్లీపురంలో..
నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని అల్లీపురంలో టిడ్కో గృహాల్లో ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ జరిగింది. మొత్తం 120 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి 300 ఇళ్లలో తనిఖీలు చేశారు. సరైన పత్రాల్లేని 46 మోటార్‌బైక్‌లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు.
టిడ్కో గృహాల్లో కార్డన్ సెర్చ్


