సాయం అందించాలి
ఉప్పు సాగునే నమ్ముకుని జీవించేవారం. పదేళ్లుగా సరైన పనుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్యాకేజీ రైతులతోపాటు మాలాంటి కార్మికులకు సైతం పోర్టు వారు సాయం అందజేస్తే కొంత వెసులుబాటు ఉంటుంది. జీవనం కూడా కష్టం మారింది. పోర్టులో మాకు తగిన పనులు లేవంటున్నారు.
– ఎం.రమణమ్మ,
గోపాలపురం, ఉప్పు కార్మికురాలు
యాజమాన్యం
పట్టించుకోవాలి
కృష్ణపట్నం పోర్టు రావడం మాకు సంతోషమే. కానీ మాకు జీవనాధారం లేకుండాపోయింది. గతంలో ఉప్పు సాగు వల్ల చేతినిండా పనులు లభించేవి. నేడు మాకు తెలిసిన పనులు చేసేందుకు వీలులేకుండాపోయింది. పోర్టు యాజమాన్యం పెద్ద మనస్సు చేసుకుని ప్యాకేజీ ప్రకటించాలి.
– జి.సుబ్రహ్మణ్యం,
కృష్ణపట్నం, ఉప్పు కార్మికుడు
●
సాయం అందించాలి


