యూనియన్‌ సభ్యుల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

యూనియన్‌ సభ్యుల సంక్షేమానికి కృషి

Jan 5 2026 7:29 AM | Updated on Jan 5 2026 7:29 AM

యూనియన్‌ సభ్యుల సంక్షేమానికి కృషి

యూనియన్‌ సభ్యుల సంక్షేమానికి కృషి

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ఏపీ బహుజన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పోతుల సురేష్‌, ప్రధాన కార్యదర్శి అంజయ్య, కంపెనీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం (ఏఈ) అన్నారు. నెల్లూరులోని ఏఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో రెండు రోజులుగా జరుగుతున్న యూనియన్‌ రాష్ట్ర సర్వసభ్య సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూనియన్‌ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోటారాలు చేసేందుకు యూనియన్‌ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సుందరకుమార్‌ వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్‌.సురేష్‌, కార్యనిర్వహక అధ్యక్షుడిగా పులి చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా అంజయ్య, కోశాధికారిగా రాజు ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా ఎస్‌కే మీరావలీ, సంయుక్త కార్యదర్శిగా వాసుదేవ్‌, కార్యనిర్వాహక కార్యదర్శిగా శుభకర్‌, సభ్యులుగా దేవదాసు, పూర్ణచంద్రరావు, జార్జి, గోపిరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో వందనకుమార్‌, సువర్ణ కుమారి, అడ్వైజర్‌ రవినారాయణ(డీఈఈ), బెనర్జీ (కావలి ఈఈ), డిస్కం సెక్రటరీ బాలరాజు, జిల్లా అధ్యక్షురాలు సౌజన్య, సెక్రటరీ వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement