
ఆశ వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని ఆశ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ సుజాతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న ఆశ వర్కర్లను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలన్నారు. ఎన్‌హెచ్‌ఎం స్కీం ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తయినా వారికి కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. విధినిర్వహణలో మృతిచెందిన వారికి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఆశాలను రెగ్యులర్‌చేసి హెల్త్ వర్కర్స్‌గా గుర్తించాలన్నారు.
పింఛన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కోశాధికారి మధుసూదన, కల్యాణి, వాణి, జీవా, సునీత, గీత, సురేఖ తదితరులు పాల్గొన్నారు.