ఆత్మకూరు: మోటార్‌బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై ఆంధ్రా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో గురువారం జరిగింది. ఎస్సై ఎస్‌కే జిలానీ కథనం మేరకు.. తెల్లపాడు ముస్తాపురం గ్రామానికి చెందిన తాటిపర్తి ఈశ్వర్ (19) కూలి పనులు చేస్తుంటాడు.
ఈ క్రమంలో కరటంపాడుకు బైక్‌పై వెళ్లి తిరిగి ముస్తాపురానికి వస్తున్నాడు. ఆంధ్రా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో లారీ బైక్‌ను ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై ఈశ్వర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


