కలెక్టర్ చెప్పినా తహసీల్దార్ ఇబ్బంది పెడుతున్నాడు
కోవూరు నందలగుంట గిరిజనులకు ఆ సమీపంలో 15 సెంట్ల శ్మశాన స్థలం ఉంది. శ్మశానం పక్కనే ఒక వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రి నిర్మిస్తూ శ్మశాన స్థలాన్ని ఆక్రమించాడు. ఈ విషయమై మూడు నెలలుగా ప్రతి వారం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం. కలెక్టర్ ఆనంద్ స్పందించి తహసీల్దార్‌కు ఫోన్ చేశారు. తహసీల్దార్, వీఆర్వో సర్వే చేసి శ్మశాన స్థలాన్ని గత నెల 11వ తేదీన గిరిజనులకు అప్పగించారు. హద్దులు కూడా వేయించారు. అయితే ఏమి జరిగిందో ఏమో నెల తిరిగే లోపు కలెక్టర్ రాతపూర్వకంగా తనకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తహసీల్దార్ చెప్పారు. అందువల్ల కలెక్టర్ వద్దకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకోవాలని ఇప్పుడు మెలిక పెట్టారు. ఇది గిరిజనుల శ్మశాన వాటిక కాదని చెబుతున్నారు. దీని వెనుక ఏ పెద్దలు ఉన్నారో తమకు అర్థం కావడంలేదు. కలెక్టర్ ఈ రోజు కూడా ఆ శ్మశాన స్థలం గిరిజనులదేనని చెప్పారు. ఆచరణలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కలెక్టర్ ఆదేశాలు ఇస్తు న్నా.. క్షేత్రస్థాయిలో కూటమి ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తో అధికారులు అన్యాయంగా వ్యవహరిస్తున్నారు.
– నందిపోగు రమణయ్య,
వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి
విజయమ్మ, జ్యోతి, నందలగుంట గిరిజనులు


