యువత పాల్గొనాలి : కలెక్టర్
నెల్లూరు రూరల్: యూత్ పార్లమెంట్ – 2025లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న యువతీ, యువకులు పాల్గొనాలని కలెక్టర్ ఆనంద్ కోరారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తన కార్యాలయంలో బుధవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధికి యువత తమ ప్రణాళికలను పంచుకోవడానికి యూత్ పార్లమెంట్ – 2025 మంచి వేదిక అన్నారు. ఆసక్తి గల వారు వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై మై భారత్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని వికసిత భారత్‌పై ఒక నిమిషం వీడియోను చిత్రీకరించి నెల్లూరు నోడల్ డిస్ట్రిక్ పోర్టల్లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ్‌శంకర్ అల్లం (81878 14140) నెహ్రూ యువ కేంద్రం అధికారి డాక్టర్ ఎ.మహేంద్రరెడ్డి (99635 33440)ను సంప్రదించాలన్నారు.


