విడవలూరు: ధాన్యానికి గిట్టుబాటు ధరను కల్పించి, రైతులను ఆదుకోవాలని కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నదాతలకు అండ.. వైఎస్సార్‌సీపీ అజెండా అనే నినాదంతో విడవలూరులోని అంకమ్మతల్లి దేవస్థానం వద్ద సోమవారం ఆయన ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. తర్వాత వైఎస్సార్‌సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు పూండ్ల అచ్యుత్‌రెడ్డి, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు, డీఏఏబీ మాజీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఒక్క రైతును ఆదుకున్నాడన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌లను అందుబాటులో ఉంచారని తెలిపారు. రైతు భరోసా సొమ్ము జమ చేశాడని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రైతన్నలను రోడ్డుపాలు చేసిందని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలను చూస్తే భయమేస్తుందన్న వ్యక్తి 2029లో సూపర్ 10 పథకాలతో మళ్లీ మనముందుకు వస్తాడని, అప్పుడు రైతులే తగిన బుద్ధి చెప్పాలన్నారు. కోవూరు నియోజకవర్గంలో రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు. ఇకనైనా రెవెన్యూ, వ్యవసాయ, సివిల్ సప్లయ్స్ విభాగాల అధికారులు రైస్ మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కాటంరెడ్డి నవీన్‌రెడ్డి, ఇందుకూరుపేట మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు కొండూరు వెంకటసుబ్బారెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం నగర కన్వీనర్ షేక్ షాహుల్, కౌన్సిలర్లు షకీలా బేగం, ప్రమీలమ్మ, జయంతి, అనంతలక్ష్మి, యానాదిరెడ్డి, వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధరకు ప్రభుత్వం
ధాన్యం కొనుగోలు చేయాలి
హామీలను విస్మరించిన
చంద్రబాబుది మోసపూరిత వైఖరి
ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే
ప్రసన్నకుమార్‌రెడ్డి
విడవలూరులో రైతులతో ర్యాలీ, ధర్నా
రైతన్నకు అండగా ఉంటాం


