జయహో జెంగ్‌... | Zheng Qinwen claims third title of season | Sakshi
Sakshi News home page

జయహో జెంగ్‌...

Oct 28 2024 3:25 AM | Updated on Oct 28 2024 3:25 AM

Zheng Qinwen claims third title of season

కెరీర్‌లో ఐదో సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన చైనా టెన్నిస్‌ స్టార్‌

డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోర్నీకీ అర్హత  

టోక్యో: పారిస్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, చైనా టెన్నిస్‌ స్టార్‌ కిన్‌వెన్‌ జెంగ్‌ ఒకే విజయంతో రెండు లక్ష్యాలు సాధించింది. ఆదివారం ముగిసిన టొరే పాన్‌ పసిఫిక్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో ఆమె విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ కిన్‌వెన్‌ కెరీర్‌లో ఐదో సింగిల్స్‌ టైటిల్‌ సాధించడంతోపాటు సీజన్‌ ముగింపు ప్రతిష్టాత్మక టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత పొందింది. 

2020 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా)తో జరిగిన ఫైనల్లో కిన్‌వెన్‌ జెంగ్‌ 7–6 (7/5), 6–3తో విజయం సాధించింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కిన్‌వెన్‌ ఏకంగా 16 ఏస్‌లు సంధించింది. కిన్‌వెన్‌కు 1,42,000 డాలర్ల (రూ. 1 కోటీ 19 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement