ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ | Yuki Bambri pair in the final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ

Jul 20 2024 2:48 AM | Updated on Jul 20 2024 2:56 PM

Yuki Bambri pair in the final

స్టాడ్‌ (స్విట్జర్లాండ్‌): స్విస్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో మూడో సీడ్‌ యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జోడీ ఫైనల్లోకి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (7/4)తో ఐదో సీడ్‌ అరెండ్స్‌–రాబిన్‌ హాస్‌ (నెదర్లాండ్స్‌) జంటను ఓడించింది.  

మరోవైపు జర్మనీలో జరుగుతున్న హాంబర్గ్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న–శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) జోడీ తొలి రౌండ్‌లో 1–6, 4–6తో జేకబ్‌ ష్నయిటర్‌–మార్క్‌ వాల్నర్‌ (జర్మనీ) జంట చేతిలో ఓటమి పాలైంది.  

Advertisement
 
Advertisement
Advertisement