నేడు ఫైనల్‌ సమరం | Archery Premier League final showdown today | Sakshi
Sakshi News home page

నేడు ఫైనల్‌ సమరం

Oct 18 2026 2:39 AM | Updated on Oct 18 2026 2:39 AM

Archery Premier League final showdown today

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆర్చర్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ టోర్నీ చివరి రోజుకు చేరింది. నేడు జరిగే మూడు మ్యాచ్‌లతో టోర్నీ ముగుస్తుంది. ముందుగా లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కాకతీయ నైట్స్, మైటీ మరాఠాస్‌ ‘షార్ట్‌ కట్‌ డిసైడర్‌’ మ్యాచ్‌లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో విజేత నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టు ‘ఎలిమినేటర్‌ 2’లో పృథ్వీరాజ్‌ యోధాస్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ విజేతకు ఫైనల్‌ అవకాశం లభిస్తుంది. మూడో మ్యాచ్‌గా ఫైనల్‌ను నిర్వహిస్తారు. 

శనివారం జరిగిన ‘ఎలిమినేటర్‌ 1’లో 5–1 (75–75, 77–74, 79–75)తో చేరో ఆర్చర్స్‌ను ఓడించి మూడో స్థానంతో పృథ్వీరాజ్‌ యోధాస్‌ ‘ప్లే ఆఫ్స్‌’కు అర్హత సాధించింది. అంతకు ముందు జరిగిన లీగ్‌ మ్యాచ్‌లలో కాకతీయ నైట్స్‌ 6–0 (77–69, 72–64, 76–74)తో మైటీ మరాఠాస్‌పై, చోళా చీఫ్స్‌ 4–4 (74–70, 68–73, 69–74, 76–73, షూటౌట్‌లో 1–0)తో చేరో ఆర్చర్స్‌పై, పృథ్వీరాజ్‌ యోధాస్‌ 6–0 (76–73, 74–72, 78–73)తో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాజ్‌పుతానా రాయల్స్‌పై విజయం సాధించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement