WTC Final: అతను సెంచరీ కొట్టాడా టీమిండియా గెలిచినట్లే..!

WTC Final 2021 23: India Never Lost A Test Match When Rahane Scored Century - Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాం‍పియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లతో జరిగే ప్రత్యేక కార్యక్రమం కూడా అయిపోయింది. కెప్టెన్లు ఇద్దరూ డబ్ల్యూటీసీ గదతో ఫోటో షూట్‌లో కూడా పాల్గొన్నారు. ఫైనల్‌కు చేరే క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. ఫైనల్‌ మ్యాచ్‌లో తమ ప్రణాళికలు, జట్టు కూర్పు తదితర విషయాలను షేర్‌ చేసుకున్నారు. అంతిమంగా ఇరు జట్ల కెప్టెన్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రేపు (జూన్‌ 7) మధ్యాహ్నం 3 గం‍టల నుండి ప్రారంభంకానుంది. 

ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది. ఈ విషయం ముఖ్యంగా టీమిండియా అభిమానులను తెగ సంతోషానికి గురి చేస్తుంది. అదేంటంటే.. టీమిండియా బ్యాటర్‌ అజింక్య రహానే టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన ప్రతిసారి టీమిండియా ఓడిపోలేదు. రహానే తన టెస్ట్‌ కెరీర్‌లో 12 సెంచరీలు చేయగా.. వాటిలో టీమిండియా 9 మ్యాచ్‌ల్లో గెలుపొంది, 3 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

రహానే సెంచరీ చేసిన గత ఐదు సందర్భాల్లో టీమిండియా ప్రతి మ్యాచ్‌ గెలుపొందింది. ఈ సెంటిమెంటే ప్రస్తుతం టీమిండియా అభిమానుల సంతోషానికి కారణం. ఐపీఎల్‌ 2023లో సత్తా చాటి, దాదాపు ఏడాదిన్నర తర్వాత తిరిగి భారత జట్టులోకి వచ్చిన రహానే తన ఐపీఎల్‌ ఫామ్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్లో కొనసాగించి సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్‌ బలంగా నమ్ముతున్నారు. ఇదే జరిగితే టీమిండియా గెలుపు గ్యారెంటీ అని ధీమాగా ఉన్నారు. రహానే సెంచరీల సెంటిమెంట్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ, గెలుపు తమదేనని కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: WTC Final: అంతా సిద్ధం.. ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్ల ఫోటోషూట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top