
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (ICC Women's World Cup 2025) భాగంగా భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
మ్యాచ్ మధ్యలో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా మ్యాజిక్ స్ప్రేను (Spray) ప్రయోగించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఇంతకీ పాక్ కెప్టెన్ ఎందుకలా చేసిందని అభిమానులు ఆరా తీస్తున్నారు.
వివరాల్లో వెళితే.. కొలొంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి చిన్నచిన్న పరుగులు మైదానమంతా వ్యాపించి ఇరు జట్ల ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాయి. ఈ పరుగుల కారణంగా మ్యాచ్‌కు పలు మార్లు అంతరాయం కలిగింది.
ఇన్నింగ్స్ మధ్యలో పురుగుల ప్రభావం చాలా ఎక్కువైంది. దీని వల్ల భారత ఆటగాళ్లు బ్యాటింగ్ చేయలేకపోయారు. ఈ విషయమై అప్పుడు క్రీజ్‌లో ఉన్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అంపైర్‌కు ఫిర్యాదు చేసింది. పురుగుల వల్ల తాను బంతిపై దృష్టి సారించలేకపోతున్నానని తెలిపింది.
దీంతో ఇన్నింగ్స్ 28వ ఓవర్‌లో అంపైర్ పరుగులు తరిమే స్ప్రేను ఉపయోగించేందుకు పర్మిషన్ ఇచ్చాడు. పాక్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ ఒకరు స్ప్రే తీసుకొచ్చి వారి కెప్టెన్ ఫాతిమా సనాకు ఇవ్వగా, ఆమె దాన్ని ఉపయోంచి పురుగులను తరిమికొట్టింది. స్ప్రే ఉపయోగించిన తర్వాత కాస్త ఉపశమనం లభించడంతో భారత ఆటగాళ్లు బ్యాటింగ్‌కు కొనసాగించారు.
శ్రీలంకలోని క్రికెట్ మైదానాల్లో ఇలాంటి సన్నివేశాలు తరుచూ కనిపిస్తుంటాయి. పరుగులు, జంతువులు, పాములు పిలవని పేరంటాలకు వచ్చి పోతుంటాయి. తాజాగా భారత జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా మైదానంలోకి పెద్ద పాము ప్రవేశించింది. పాములు పట్టే వారు వచ్చి దాన్ని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 44 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రతీక రావల్ (31), స్మృతి మంధన (23), హర్లీన్ డియోల్ (46), హర్మన్‌ప్రీత్ (19), జెమీమా రోడ్రిగెజ్ (32) ఔట్ కాగా.. దీప్తి శర్మ (24), స్నేహ్ రాణా (16) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: భారత్‌తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్