
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించి అందరికి షాకిచ్చాడు. ఇకపై కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగనున్నట్లు హిట్‌మ్యాన్ తెలిపాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ టూర్‌కు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో కొత్త టెస్టు కెప్టెన్‌ను ఎంపిక చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది.
కెప్టెన్సీ రేసులో స్టార్ ప్లేయర్లు శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. ప్రస్తుతం బుమ్రా.. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కానీ గాయాల బెడద, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతన్ని ఈ కెప్టెన్స్ రేసు నుంచి గ్రూప్ నుంచి తప్పించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు వినికిడి. తాజాగా ఈ జాబితాలోకి కేఎల్ రాహుల్ చేరినట్లు సమాచారం.
కెప్టెన్‌గా తక్కువ అనుభవం ఉన్న గిల్, పంత్ కంటే సీనియర్ ప్లేయర్ అయిన రాహుల్‌కు పగ్గాలు అప్పగిస్తే బెటర్ అని సెలక్టర్లు భావిస్తున్నట్లు అజిత్ అగార్కర్ అండ్ కో భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంగ్లండ్ సిరీస్ తర్వాత పూర్తి స్ధాయి కెప్టెన్‌ను నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కెప్టెన్‌గా రాహుల్..
టెస్టు కెప్టెన్సీ పరంగా కేఎల్ రాహుల్‌కు అనుభవం ఉంది. గతంలో మూడు సార్లు టీమిండియాకు రాయల్ నాయకత్వం వహించాడు. 2022లో అతడి సారథ్యంలోనే బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. అదేవిధంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో కూడా రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్‌లో వ్యక్తిగత గణాంకాల పరంగా కూడా రాహుల్‌కు మంచి రికార్డు ఉంది. ఇంగ్లండ్ గడ్డపై ఈ వికెట్ కీపర్ ఈ కీపర్-బ్యాటర్ 9 మ్యాచ్‌ల్లో 614 పరుగులు చేశాడు. ఈ టెస్టు పర్యటనకు బీసీసీఐ భారత జట్టును మే రెండో వారంలో ప్రకటించే అవకాశముంది.
చదవండి: పీసీబీకి చావు దెబ్బ!.. రావల్పిండి స్టేడియంపై డ్రోన్ దాడి?.. PSLపై నీలినీడలు!