WI Vs ENG: West Indies Announced Full Squad For 1st Test Against England - Sakshi
Sakshi News home page

WI Vs ENG 1st Test: ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌.. జట్టును ప్రకటించిన విండీస్‌.. అతడు రీ ఎంట్రీ!

Feb 26 2022 5:34 PM | Updated on Feb 26 2022 7:03 PM

West Indies Announce Squad For 1st Test vs England - Sakshi

స్వదేశంలో ఇంగ్లండ్‌తో వెస్టిండీస్‌ మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్ట్‌కు వెస్టిండీస్ తమ జట్టును ప్రకటించింది. ఆంటిగ్వా వేదికగా మార్చి 8న ఇంగ్లండ్‌- విండీస్‌ తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఫాస్ట్ బౌలర్ అండర్సన్ ఫిలిప్ టెస్టుల్లో వెస్టిండీస్‌ తరుపున అరంగేట్రం చేయనున్నాడు. ఇక వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతంగా రాణించిన జాన్ కాంప్‌బెల్ జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు. కాగా ఈ జట్టుకు క్రైగ్ బ్రాత్‌వైట్ నాయకత్వం వహించనుండగా, జెర్మైన్ బ్లాక్‌వుడ్ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా ఇప్పటికే ఆంటిగ్వా చేరుకున్న విండీస్‌ జట్టు ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. ఇక యాషెస్‌ సిరీస్‌లో ఘోర పరాభవం  తర్వాత ఇంగ్లండ్‌ తొలి సారిగా టెస్ట్‌ సిరీస్‌లో పాల్గోనుంది. ఈ సిరిస్‌లో విండీస్‌ను వారి సొంత గడ్డపై మట్టి కరిపించాలని ఇంగ్లండ్‌ భావిస్తోంది.

వెస్టిండీస్ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), న్క్రుమా బోన్నర్, షమర్ బ్రూక్స్, జాన్ క్యాంప్‌బెల్, జాషువా డా సిల్వా, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కైల్ మేయర్స్, వీరసామి పెర్మాల్, అండర్సన్ రోచిలిప్, ఆండర్సన్ ఫిలిప్ సీల్స్

చదవండి: IND vs SL: విరాట్‌ కోహ్లి 100వ టెస్ట్‌.. అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement