ODI WC 2023 IND Vs BAN: కొంచెం కూడా ఓపిక లేదు.. అలా వికెట్లు పారేసుకుంటే ఎలా?: యువ బ్యాటర్లపై భారత దిగ్గజం ఫైర్‌

WC 2023 You Need To: Gavaskar Slams Gill Iyer For Throwing Away Wickets - Sakshi

ICC ODI WC 2023- Virat Kohli: టీమిండియా యువ బ్యాటర్లు శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ల ఆట తీరుపై భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ మండిపడ్డాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకుని భారీ స్కోర్లు చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారని విమర్శించాడు.

ముఖ్యంగా శ్రేయస్‌ అయ్యర్‌కు క్రీజులో నిలబడే ఓపిక ఉండటం లేదని.. విరాట్‌ కోహ్లిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ యువ ప్లేయర్‌కు చురకలు అంటించాడు. అయ్యర్‌తో పోలిస్తే గిల్‌ కాస్త నయమేనని.. అయితే, ఇలాంటి ప్రతిష్టాత్మక​ ఈవెంట్లలో ఫిఫ్టీలను సెంచరీలుగా మార్చడంపై మరింత దృష్టి సారించాలని గావస్కర్‌ సూచించాడు.

వన్డే ప్రపంచకప్‌-2023లో పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయభేరి మోగించిన విషయం తెలిసిందే. తద్వారా వరల్డ్‌కప్‌ తాజా ఎడిషన్‌లో వరుసగా నాలుగో గెలుపు నమోదు చేసింది. 

ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ కెరీర్‌లో 78వ సెంచరీ నమోదు చేశాడు. క్రీజులో నిలదొక్కుకుని ఓపికగా ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ తన వ్యక్తిగత స్కోరు పెంచుకోవడంతో పాటు.. జట్టును లక్ష్యానికి చేరువ చేశాడు.

సిక్స్‌తో విజయలాంఛనం పూర్తి చేసి వన్డేల్లో 48వ శతకం పూర్తి చేసుకుని పలు అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా తర్వాత వేగం పెంచి 53 పరుగులతో రాణించాడు.

అయితే, బంగ్లా స్పిన్నర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో మహ్మదుల్లాకు క్యాచ్‌ ఇవ్వడంతో గిల్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక గిల్‌ ఫర్వాలేదనిపించినా.. అయ్యర్‌ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.

మరో ఎండ్‌లో కోహ్లి తన అనుభవాన్ని రంగరించి అద్భుతంగా ముందుకు సాగుతున్న వేళ.. శ్రేయస్‌ అయ్యర్‌ మాత్రం 19 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఈ నాలుగో నెంబర్‌ బ్యాటర్‌ కూడా మిరాజ్‌ చేతికే చిక్కి చెత్త షాట్‌ సెలక్షన్‌తో వికెట్‌ సమర్పించుకున్నాడు.

ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో సునిల్‌ గావస్కర్‌ మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్‌ అయ్యర్‌కు ఓపిక లేదు. 19 పరుగుల వద్ద ఉన్నపుడు తన వికెట్‌ పారేసుకున్నాడు. ఇక శుబ్‌మన్‌ గిల్‌ ఫిఫ్టీ(53) పూర్తి చేసుకున్న తర్వాత వికెట్‌ సమర్పించుకున్నాడు.

ఇలాంటి టోర్నీల్లో సెంచరీ ఎలా చేయాలో అయ్యర్‌, గిల్‌ తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే, గిల్‌ ఇటీవల సెంచరీలు సాధించి ఫామ్‌లోనే కనిపిస్తున్నాడు. కానీ.. శ్రేయస్‌ అ‍య్యర్‌ నుంచి మంచి ఇన్నింగ్స్‌ కరువైంది.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో వచ్చిన ఆటగాడికి అప్పటికే పిచ్‌ గురించి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. నిజానికి నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌ చేయడం ఒకరకంగా సువర్ణావకాశం లాంటిదే. పరిస్థితులను అర్థం చేసుకుని ముందు సాగాలే తప్ప సహనం కోల్పోతే ఇలాగే వికెట్‌ పారేసుకోవాల్సి వస్తుంది’’ అని అయ్యర్‌ ఆట తీరును విమర్శించాడు. 

ఇక శతకాల వీరుడు కోహ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఎప్పుడూ ఇలా నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకున్నది లేదు. జాగ్రత్తగా ఆడటం అతడికి అలవాటు. ప్రతిఒక్క క్రికెటర్‌కు ఉండాల్సిన లక్షణం ఇదే.

70-80 పరుగుల వద్ద ఉన్నపుడు సెంచరీ ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో ముందుకు సాగుతాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం సహా అనుకున్నది సాధించడం కోసం ఓపికగా ఎదురుచూస్తాడు. ప్రతిరోజూ.. ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ చేసే అవకాశం రాదు కదా!’’ అని గావస్కర్‌.. కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు.

చదవండి: Virat Kohli: 78వ సెంచరీ! వాళ్ల వల్లే సాధ్యమైంది.. జడ్డూకు సారీ చెప్పాలి: కోహ్లి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-11-2023
Nov 12, 2023, 16:32 IST
హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్‌.. హ్యాట్రిక్‌ శ్రేయస్‌ అయ్యర్‌ 48 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో ప్రస్తుత వరల్డ్‌కప్‌లో నాలుగో...
12-11-2023
Nov 12, 2023, 15:57 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో ఇవాళ (నవంబర్‌ 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ...
12-11-2023
Nov 12, 2023, 13:36 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో చివరి లీగ్‌ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా భారత్‌-నెదర్లాండ్స్‌ జట్లు...
12-11-2023
Nov 12, 2023, 13:25 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్‌కు ముందు దక్షిణాఫ్రికా బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ టెంబా బావుమా గాయం కారణంగా...
12-11-2023
Nov 12, 2023, 12:32 IST
అఫ్గానిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గుర్భాజ్‌.. ఆఫ్‌ది...
12-11-2023
Nov 12, 2023, 12:05 IST
పాకిస్తాన్‌ క్రికెట్ టీమ్‌.. వన్డే ప్రపంచకప్‌-2023 టైటిల్‌ ఫేవరేట్‌గా భారత గడ్డపై అడుగుపెట్టిన జట్లలో ఒకటి. కానీ అందరి అంచనాలను...
12-11-2023
Nov 12, 2023, 09:18 IST
వన్డే ప్రపంచకప్‌-2023 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న భారత్‌-నెదర్లాండ్‌ మ్యాచ్‌తో ఈ ​మెగా టోర్నీ లీగ్‌ స్టేజి ముగియనుంది....
12-11-2023
Nov 12, 2023, 08:53 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023ను పాకిస్తాన్‌ ఓటమితో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 93...
12-11-2023
Nov 12, 2023, 07:44 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా తమ అఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో...
11-11-2023
Nov 11, 2023, 21:37 IST
వన్డే ప్రపంచకప్‌-2023ను ఇంగ్లండ్‌ విజయంతో ముగించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో 93 పరుగుల...
11-11-2023
Nov 11, 2023, 21:09 IST
ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో 1000 పరుగులు చేసిన తొలి...
11-11-2023
Nov 11, 2023, 20:13 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్స్‌కు భారత్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు అర్హత...
11-11-2023
Nov 11, 2023, 19:32 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్‌ రేసు నుంచి పాకిస్తాన్‌ అధికారికంగా నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో...
11-11-2023
Nov 11, 2023, 19:01 IST
పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ ఎడిషన్‌ లీగ్‌...
11-11-2023
Nov 11, 2023, 18:20 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ను అద్బుతమైన విజయంతో ఆస్ట్రేలియా ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే...
11-11-2023
Nov 11, 2023, 18:06 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ ఎట్టకేలకు తమ బ్యాటింగ్‌ విశ్వరూపం చూపించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా తమ ఆఖరి లీగ్‌...
11-11-2023
Nov 11, 2023, 17:15 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన పాకిస్తాన్‌.. తర్వాతి...
11-11-2023
Nov 11, 2023, 16:35 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీస్‌ రేసు నుంచి పాకిస్తాన్‌ నిష్కమ్రిచించడం దాదాపు ఖాయమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌...
11-11-2023
Nov 11, 2023, 15:47 IST
వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌ సెమీఫైనల్స్‌కు చేరకపోయినప్పటికీ.. తమ అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది. తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో...
11-11-2023
Nov 11, 2023, 14:13 IST
ICC WC 2023- Is Pakistan Knocked Out: వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీస్‌ రేసులో నిలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top