Trolls On Virat: కోహ్లిని స్టార్క్‌తో పోల్చిన ఆసీస్‌ మీడియా.. కౌంటరిచ్చిన వసీం జాఫర్‌

Wasim Jaffer Counters Australian Media For Trolling Virat Kohli - Sakshi

Wasim Jaffer: టీమిండియా టెస్ట్‌ సారధి విరాట్‌ కోహ్లిని కించపరిచే విధంగా పోస్ట్‌లు పెట్టిన '7Cricket' అనే ఆస్ట్రేలియన్‌ వెబ్‌సైట్‌కు భారత మాజీ ఓపెనర్ వసీమ్‌ జాఫర్‌ తనదైన స్టైల్‌లో కౌంటరిచ్చాడు. 2019 నుంచి టెస్ట్‌ల్లో కోహ్లి బ్యాటింగ్‌ సగటు(38.63)ను ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ సగటు(37.17)తో పోలుస్తూ.. సదరు వెబ్‌సైట్‌ చేసిన ట్విట్‌కు జాఫర్‌ దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. 

టీమిండియా యువ పేసర్‌ నవ్‌దీప్‌ సైని వన్డే బ్యాటింగ్‌ సగటు(53.50).. ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ (43.34) కన్నా మెరుగ్గా ఉందని రీట్వీట్‌ చేశాడు. వసీమ్‌ పంచ్‌కు సదరు వెబ్‌సైట్‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. వసీమ్‌ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. అతనిచ్చిన కౌంటర్‌కు టీమిండియా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. లైకులు, షేర్లతో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. 

కాగా, కోహ్లి గత రెండేళ్లుగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న సంగతి తెలిసిందే. అతను 2019లో తన చివరి శతకాన్ని బాదాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న కోహ్లి.. వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. జనవరి 11 నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 
చదవండి: సచిన్‌ టెండూల్కర్‌ కఠిన నిర్ణయం.. హర్ట్‌ అయిన అభిమానులు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top