Sachin Tendulkar Not Participating In Legends League Cricket 2022, Details Inside - Sakshi
Sakshi News home page

Sachin Tendulkar: సచిన్‌ టెండూల్కర్‌ కఠిన నిర్ణయం.. హర్ట్‌ అయిన అభిమానులు

Published Sat, Jan 8 2022 9:17 PM

Sachin Tendulkar Not To Be Part Of Legends League Cricket Says SRT Sports Management - Sakshi

క్రికెట్‌ గాడ్‌ సచిన్ టెండూల్కర్ అభిమానులకు షాకిచ్చాడు. త్వరలో ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ఆడకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. కరోనా కారణంగా సచిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జనవరి 20 నుంచి 29 వరకు ఒమన్‌ వేదికగా జరగనున్న లెజెండ్స్‌ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా మహరాజాస్ జట్టు తరఫున సచిన్‌ బరిలోకి దిగాల్సి ఉండింది. 

అయితే, ప్రస్తుతం లీగ్‌లో ఆడేందుకు సచిన్‌ నో చెప్పడంతో అభిమానలు హర్ట్‌ అయ్యారు. ఈ లీగ్‌లో టీమిండియా మాజీ క్రికెటర్లు, డాషింగ్‌ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ తదితరులు మరోసారి కలిసి బరిలోకి దిగబోతున్నారు. ఇండియా మహరాజాస్‌తో పాటు ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ జట్లు లీగ్‌లో పొల్గొంటున్నాయి. ఆసియా లయన్స్ తరఫున ఆసియా క్రికెటర్లు( ఆఫ్రిది, జయసూర్య, అక్తర్, మురళీధరన్ తదితరులు), వరల్డ్ జెయింట్స్ తరఫున ఆసియా ఏతర క్రికెటర్లు( జాంటీ రోడ్స్,షేన్ వార్న్, షాన్ పొలాక్, లారా తదితరులు) రంగంలోకి దిగనున్నారు. 


ఈ లీగ్‌కు బిగ్‌ బీ అమితాబ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి. కాగా, గత రెండు సీజన్ల నుంచి లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ విపరీతమైన ప్రజాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్లో యువీ, సచిన్‌, పఠాన్‌ సోదరులు మెరుపుల్ని ఎవరూ మర్చిపోలేరు. అయితే లీగ్‌ ముగిసిన వెంటనే ఇండియా లెజెండ్స్‌లో చాలా మందికి కరోనా వైరస్‌ సోకింది. మొదట సచిన్‌, ఆ తర్వాత పఠాన్‌ సోదరులు, యువీ మహమ్మారి బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో సచిన్‌ ఈ ఏడాది లీగ్‌కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 
చదవండి: ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా ఓపెనర్‌.. పది వికెట్ల కివీస్‌ బౌలర్‌ కూడా..

Advertisement
Advertisement