
బార్బోడస్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. వారిద్దరికి విశ్రాంతి ఇచ్చి.. కొత్త ఆటగాళ్లను పరీక్షించాలని జట్టు మెన్‌మెజ్‌మెంట్ భావించినట్లు టాస్ సందర్భంగా స్టాండింగ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌కు కోహ్లి దూరంగా ఉన్నప్పటికీ.. మైదానంలో మాత్రం ఓ సారి దర్శనిమిచ్చాడు.
కోహ్లి డ్రింక్స్ బాయ్ అవతరమెత్తాడు. చాహల్‌తో కలిసి డ్రింక్స్ బాయ్ గా మారిన కింగ్ కోహ్లి.. భారత ప్లేయర్లకు నీళ్లు, అరటి పళ్లను అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మారింది. దీంతో కోహ్లిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాట కోహ్లికి సరిగ్గా సరిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. . వెస్టిండీస్ చేతిలో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 34; 5 ఫోర్లు) రాణించాడు. రొమారియో షెఫర్డ్ (3/37), గుడకేశ్ మోతీ (3/36), అల్జారి జోసెఫ్ (2/35) కలిసికట్టుగా భారత్‌ను కట్టడిచే శారు. . అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
చదవండి: చాలా బాధగా ఉంది.. మా ఓటమికి కారణం అదే! అతడొక అద్భుతం: హార్దిక్
1 hi to ❤️ hai, kitne baar jeetoge? King Kohli turns water boy!
— FanCode (@FanCode) July 29, 2023
.
.#INDvWIAdFreeonFanCode #INDvWI pic.twitter.com/CYE2uvNAC2