ఆ ట్రోఫీ గెలవకుంటే కోహ్లి తప్పుకోవాల్సిందే

Virat Kohli Have To Step Down As Captain If India Wont Get ICC Titles - Sakshi

లండన్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు మాంటీ పనేసర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  రానున్న టీ20, వన్డే ప్రపంచకప్‌లను టీమిండియా గెలవకపోతే కోహ్లి కెప్టెన్సీ పదవి నుంచి దిగిపోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపాడు.  కోహ్లి సారధ్యంలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లు చాలానే గెలిచినా.. ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో మాత్రం విఫలమయింది.

ఈ నేపథ్యంలోనే పనేసర్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడాడు.' రానున్న రోజుల్లో రెండు మేజర్‌ టోర్నీలు ఇండియాలోనే జరగనున్నాయి. అందులో ఒకటి టీ20 ప్రపంచకప్‌.. మరొకటి వన్డే ప్రపంచకప్‌.. ఈ రెండింటింలో కనీసం ఒక్కదాన్నయినా కోహ్లి కెప్టెన్సీలో గెలవాల్సి ఉంటుంది. 2017 నుంచి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కోహ్లి ద్వైపాక్షిక సిరీస్‌లను గెలిచినా.. అతని ఖాతాలో మేజర్‌ టైటిల్‌ లేకపోవడం ఆశ్యర్యకరం.చదవండి: 'అక్కడుంది టీమిండియా.. కాస్త జాగ్రత్తగా ఆడండి'

ఒకవేళ ఈసారి భారత్‌లో జరిగే మేజర్‌ టోర్నీలను గెలవకపోతే కెప్టెన్‌ పదవి నుంచి కోహ్లి దిగిపోవాల్సిందే. కోహ్లి లేకున్నా టీమిండియా సిరీస్‌లు గెలవగలదని ఆసీస్‌ పర్యటనతో నిరూపితమైంది. కోహ్లి గైర్హాజరీలో రహానే సారధ్యంలో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీని 2-1తేడాతో గెలవడమే ఇందుకు నిదర్శనం. రహానేకు వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ మంచి సపోర్ట్‌ ఇచ్చాడు.ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఆసీస్‌ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్‌ను గెలిచేందుకు దోహదపడింది. దీన్నిబట్టి చూస్తే కోహ్లి నుంచి కెప్టెన్సీ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.'అంటూ తెలిపాడు.చదవండి: ఐపీఎల్‌: రిటైన్‌ లిస్టులో పేరు లేకపోవడం బాధాకరం

కాగా ఇంగ్లండ్‌ జట్టు ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. టీమిండియాతో ఇంగ్లండ్‌ నాలుగు టెస్టులు.. మూడు వన్డేలు.. 5 టీ20లు ఆడనుంది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top