కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌లో.. జ్యోతి సురేఖ | Vennam Jyoti Surekha Wins Three Gold Medals In World Cup Archery Stage-1 Tournament | Sakshi
Sakshi News home page

కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌లో.. జ్యోతి సురేఖ

Apr 30 2024 9:43 AM | Updated on Apr 30 2024 9:43 AM

Vennam Jyoti Surekha Wins Three Gold Medals In World Cup Archery Stage-1 Tournament

ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నీలో మూడు స్వర్ణ పతకాలతో మెరిసిన ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ తన కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకుంది.

సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సురేఖ కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో 299 పాయింట్లతో రెండో ర్యాంక్‌ లో నిలిచింది. గత ర్యాంకింగ్స్‌లో సురేఖ మూడో ర్యాంక్‌లో ఉంది. మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి 103 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల రికర్వ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ ధీరజ్‌ 18వ ర్యాంక్‌లో ఉన్నాడు.

ఇవి చదవండి: Archery: 'టాప్స్‌'లోకి దీపికా కుమారి

Advertisement
 
Advertisement
Advertisement