టీ20 వరల్డ్‌కప్‌ షురూ.. దక్షిణాఫ్రికాను ఢీకొట్టనున్న భారత్‌

Under 19 Women T20 WC: Team India To Take On South Africa In Inaugural Match - Sakshi

Under 19 Women T20 WC: తొట్ట తొలి అండర్‌–19 మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీ దక్షిణాఫ్రికా వేదికగా నేటి నుంచి ప్రారంభంకానుంది. 16 జట్లు తలపడుతున్న ఈ టోర్నీ ఈనెల 29న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. గ్రూప్‌ ‘ఎ’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అమెరికా; గ్రూప్‌ ‘బి’లో ఇంగ్లండ్, పాకిస్తాన్, జింబాబ్వే, రువాండా; గ్రూప్‌ ‘సి’లో ఇండోనేసియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌; గ్రూప్‌ ‘డి’లో భారత్, దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్, యూఏఈ జట్లున్నాయి.

నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆడుతుంది. భారత జట్టులో హైదరాబాద్‌ అమ్మాయి గొంగడి త్రిష, వైజాగ్‌కు చెందిన షబ్నమ్‌ సభ్యులుగా ఉన్నారు.   

భారత జట్టు: షెఫాలి వర్మ (కెప్టెన్‌), శ్వేత సెహ్రావత్‌ (వైస్‌ కెప్టెన్‌), రిచా ఘోష్‌ (వికెట్‌కీపర్‌), జి త్రిష, సౌమ్య తివారి, సోనియా మెహ్దియా, హుర్లీ గాలా, హ్రిశిత బసు (వికెట్‌కీపర్‌), సోనమ్‌ యాదవ్‌, మన్నత్‌ కశ్యప్‌, అర్చనా దేవీ, పర్శవీ చోప్రా, టిటాస్‌ సాధు, ఫలక్‌ నాజ్‌, షబ్నమ్‌

టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..

  • జనవరి 14న సౌతాఫ్రికాతో (భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5:15 గంటలకు ప్రారంభం)
  • జనవరి 16న యూఏఈతో (మధ్యాహ్నం 1:30 గంటలకు)
  • జనవరి 18న స్కాట్లాండ్‌తో  (సాయంత్రం 5:15 గంటలకు)
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top