షేక్‌ రషీద్‌ అజేయ శతకం | Sakshi
Sakshi News home page

షేక్‌ రషీద్‌ అజేయ శతకం

Published Fri, Oct 20 2023 3:39 AM

Unbeaten century by Sheikh Rashid - Sakshi

రాంచీ: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో  ఆంధ్ర జట్టు తొలి విజయం నమోదు చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర 145 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత  ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసింది. షేక్‌ రషీద్‌ (54 బంతుల్లో 100 నాటౌట్‌; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) అరుణాచల్‌ బౌలర్లపై విరుచుకుపడి అజేయ సెంచరీ చేశాడు.  

హనుమ విహారి (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. రికీ భుయ్‌ (10 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు), కరణ్‌ షిండే (8 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసి ఓడిపోయింది. ఆంధ్ర జట్టు బౌలర్లలో స్టీఫెన్‌ (3/10), కేవీ   శశికాంత్‌ (2/2) రాణించారు. ఆంధ్ర తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 21న గుజరాత్‌తో ఆడుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement