నవంబర్‌ 8న ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌ | U19 Asia Cup 2026 Schedule Revealed, India vs Pakistan Match On November 8 | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 8న ఇండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌

Oct 8 2026 4:02 PM | Updated on Oct 8 2026 4:09 PM

U19 Asia Cup 2026 Schedule Revealed, India vs Pakistan Match On November 8

source: X

భారత్‌, పాకిస్తాన్‌ జట్లు మరోసారి ఎదురెదురుపడనున్నాయి. పురుషుల సీనియర్‌ టీ20 జట్లు ఇటీవల ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ కోసం తలపడగా.. త్వరలో అండర్‌-19 జట్లు ఆసియా కప్‌ 2026లో పోటీపడనున్నాయి.

ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ ఇవాళే వెలువడింది. ఒమన్‌ ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నీ నవంబర్ 5 నుంచి 14 వరకు జరుగనుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాకిస్తాన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. గత ఎడిషన్‌ ఫైనల్లో పాక్‌ భారత్‌ను 191 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఆ ఓటమికి ప్రతీకారం​ తీర్చుకునేందుకు భారత్‌కు అవకాశం వచ్చింది. నవంబర్‌ 8న జరిగే మ్యాచ్‌లో పాక్‌ భారత్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు ఇదే సమయంలో ప్రారంభమవుతాయి.

రెండు గ్రూపులుగా ఎనిమిది జట్లు
టోర్నీలో పాల్గొనే ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్ జట్లు ఉండగా.. గ్రూప్-బి శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, మలేషియా జట్లు పోటీపడతాయి.

గ్రూప్‌ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగిలిన మూడు జట్లతో తలపడుతుంది. రెండు గ్రూపుల్లోనూ టాప్-2 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

సెమీఫైనల్స్ రెండూ నవంబర్ 12న జరగనున్నాయి. నవంబర్ 14న ఫైనల్ నిర్వహిస్తారు. టోర్నీలోని మొత్తం 15 మ్యాచ్‌లు 50 ఓవర్ల ఫార్మాట్‌లోనే జరుగుతాయి. నవంబర్‌ 5న జరిగే తొలి మ్యాచ్‌లో శ్రీలంక, మలేషియా జట్లు తలపడతాయి. 

ఇదీ చదవండి: శ్రీలంక జట్టుకు కొత్త కెప్టెన్‌.. ప్రకటన విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement