భారత బాక్సర్లకు క్లిష్టమైన ‘డ్రా’ | A tough draw for Indian boxers | Sakshi
Sakshi News home page

భారత బాక్సర్లకు క్లిష్టమైన ‘డ్రా’

Jul 27 2024 4:07 AM | Updated on Jul 27 2024 4:07 AM

A tough draw for Indian boxers

పారిస్‌: విశ్వ క్రీడల్లో భారత బాక్సర్లు పతకాలు సాధించాలంటే శక్తివంతమైన ‘పంచ్‌’లు విసరాల్సిందే. టోక్యో ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలిచిన లవ్లీనా బొర్గొహైన్‌... తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌తోపాటు ప్రీతి పవార్, జైస్మిన్‌ లంబోరియాలకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. 50 కేజీల తొలి రౌండ్‌లో నిఖత్‌ జర్మనీ ప్లేయర్‌ మాక్సీ క్లొట్జెర్‌తో ఆడుతుంది. ఈ బౌట్‌లో గెలిస్తే రెండో రౌండ్‌లో ప్రస్తుత ఆసియా చాంపియన్, వరల్డ్‌ చాంపియన్‌ వు యు (చైనా)తో తలపడాల్సి ఉంటుంది. 

ఈ అడ్డంకిని నిఖత్‌ దాటితే క్వార్టర్‌ ఫైనల్లో చుట్‌హమట్‌ రక్సాట్‌ (థాయ్‌లాండ్‌) లేదా సబీనా బొబోకులోవా (ఉజ్బెకిస్తాన్‌)లలో ఒకరితో ఆడుతుంది. ఇటీవల స్ట్రాండ్జా స్మారక టోర్నీ ఫైనల్లో సబీనా చేతిలో, గత ఏడాది ఆసియా క్రీడల సెమీఫైనల్లో రక్సాట్‌ చేతిలో నిఖత్‌ ఓడిపోయింది. ఈసారి 75 కేజీల విభాగంలో పోటీపడుతున్న లవ్లీనా తొలి రౌండ్‌లో సునీవా హాఫ్‌స్టడ్‌ (నార్వే)తో ఆడుతుంది. క్వార్టర్‌ ఫైనల్లో లవ్లీనాకు ప్రత్యరి్థగా రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత లీ కియాన్‌ (చైనా) ఎదురుకావచ్చు. గత ఆసియా క్రీడల్లో ఫైనల్లో లీ కియాన్‌ చేతిలో లవ్లీనా ఓడిపోయింది. 

జైస్మిన్‌ (57 కేజీలు) తొలి రౌండ్‌లో నెస్తీ పెటెసియో (ఫిలిప్పీన్స్‌)తో ఆడుతుంది. తొలి రౌండ్‌లో జైస్మిన్‌ నెగ్గితే రెండో రౌండ్‌లో యూరోపియన్‌ చాంపియన్, మూడో సీడ్‌ అమీనా జిదాని (ఫ్రాన్స్‌)తో ఆడే అవకాశం ఉంది. ప్రీతి పవార్‌ (54 కేజీలు) తొలి రౌండ్‌లో వియత్నాం బాక్సర్‌ వో థి కిమ్‌ అన్‌తో ఆడుతుంది. మరోవైపు పురుషుల విభాగంలో ఇద్దరు భారత బాక్సర్లు అమిత్‌ పంఘాల్‌ (51 కేజీలు), నిశాంత్‌ దేవ్‌ (71 కేజీలు) తొలి రౌండ్‌లో ‘బై’ పొందారు.

బాక్సింగ్‌ 
మహిళల 54 కేజీల తొలి రౌండ్‌ బౌట్‌: ప్రీతి పవార్‌ ్ఠ థి కిమ్‌ అన్‌ వో (వియత్నాం); అర్ధరాత్రి గం. 12:05 నుంచి. 

టేబుల్‌ టెన్నిస్‌
పురుషుల సింగిల్స్‌ ప్రిలిమినరీ రౌండ్‌ మ్యాచ్‌: హర్మీత్‌ దేశాయ్‌ ్ఠ జైద్‌ అబో యమన్‌ (జోర్డాన్‌) రాత్రి గం. 7:15 నుంచి.

రోయింగ్‌ 
పురుషుల సింగిల్‌ స్కల్స్‌ హీట్స్‌: బలరాజ్‌ పన్వర్‌ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).

టెన్నిస్‌ 
పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌: రోహన్‌ బోపన్న–శ్రీరామ్‌ బాలాజీ ్ఠ రోజర్‌ వాసెలిన్‌–ఫాబియన్‌ రెబూల్‌ (ఫ్రాన్స్‌) మధ్యాహ్నం గం. 3:30 నుంచి.

నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్‌
బ్యాడ్మింటన్‌
పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎల్‌’ తొలి లీగ్‌ మ్యాచ్‌: లక్ష్య సేన్ఠ్‌కెవిన్‌ కార్డన్‌ (గ్వాటెమాలా) రాత్రి గం. 7:10 నుంచి. 
పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ ‘సి’ తొలి లీగ్‌ మ్యాచ్‌: సాత్విక్ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్x x లుకాస్‌ కొర్వీ–రోనన్‌ లాబర్‌ (ఫ్రాన్స్‌) రాత్రి గం. 8 నుంచి. 
మహిళల డబుల్స్‌ గ్రూప్‌ ‘సి’ తొలి లీగ్‌ మ్యాచ్‌: అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో x కిమ్‌ సో యోంగ్‌–కాంగ్‌ హీ యోంగ్‌ (దక్షిణ కొరియా) రాత్రి గం. 11:50 నుంచి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement