Tokyo Olympics 2020: Indian Men’s Hockey Team to Win Against Spain in Tokyo Olympics Group Match - Sakshi
Sakshi News home page

Tokyo Olympics: స్పెయిన్‌పై భారత్‌ ఘన విజయం

Jul 27 2021 8:38 AM | Updated on Jul 27 2021 10:03 AM

Tokyo Olympics: India Mens Hockey Team Clinch Victory Against Spain - Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన గ్రూఫ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు 3-0 తేడాతో ఘన విజయం సాధించింది.తొలి నుంచి స్పెయిన్‌పై పూర్తి ఆధిపత్యం చూపించిన భారత్‌ ఆటలో 14వ నిమిషంలో సిమ్రన్‌జిత్‌ సింగ్‌ తొలి గోల్‌తో మెరవగా.. 15వ నిమిషంలో రూపిందర్‌పాల్‌ సింగ్‌ రెండో గోల్‌తో మెరిశాడు. దీంతో తొలి క్వార్టర్‌ ముగిసేసరికి భారత్‌ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత జరిగిన రెండు, మూడు క్వార్టర్లలో భారత్‌ గోల్స్‌ చేయలేకపోయినా స్పెయిన్‌ను గోల్‌ చేయకుండా అడ్డుకుంది.

ఇక  చివరిదైన నాలుగో క్వార్టర్స్‌లో ఆట 51వ నిమిషంలో రూపిందర్‌పాల్‌ సింగ్‌ రెండో గోల్‌తో మెరవడంతో భారత్‌ 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత నిర్ణీత సమయంలో స్పెయిన్‌ ఎలాంటి గోల్‌ చేయకపోవడంతో టీమిండియా విజయాన్ని సాధించింది. భారత్‌ తరపున  రూపిందర్‌ పాల్‌ సింగ్‌ 2, సింగ్‌ సిమ్రన్‌జిత్‌ ఒక గోల్‌ చేశారు. కాగా ఈ విజయంతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా టీమిండియా పురుషుల జట్టు తన తర్వాతి మ్యాచ్‌ను జూలై 29న అర్జెంటీనాతో ఆడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement