Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా?

Tokyo Olympics: Do You Know That Neeraj Chopra Favourite Item Bread Omlete - Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో ఫైనల్లో అద్బుత ప్రదర్శన చేసి స్వర్ణం కొల్లగొట్టిన నీరజ్‌ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. స్వర్ణం సాధించి భారతీయుల కలను సాకారం చేసిన నీరజ్‌ చోప్రాకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటనేది నెటిజన్లు తెగ వెతికేశారు. అయితే నీరజ్‌ చోప్రాకు స్వీట్లు అంటే మహా ప్రాణం. స్వతహగా హర్యానా వాసి అయిన నీరజ్‌ చిన్నప్పటి నుంచి స్వీట్లు ఎక్కువగా తినడం వల్లే 12 ఏళ్ల వయసులో 90 కేజీలకు పైగా పెరిగాడు. ఆ బరువును తగ్గించుకునేందుకే జావెలిన్‌ త్రోను ఎంచుకున్నాడు. ఈరోజు ఆ క్రీడే దేశానికి ఒలింపిక్స్‌లో స్వర్ణం తెచ్చేలా చేసింది.

అయితే నీరజ్‌ చోప్రా బ్రెడ్‌ ఆమ్లెట్‌ తినడం ఎంతో ఇష్టమని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఇక తనకిష్టమైన సాల్టెడ్‌ రైస్‌ను తానే స్వయంగా వండుకొని తినడం అలవాటు చేసుకున్నాడు. ఇక టోర్నమెంట్లు ఉన్న సమయాల్లో సలాడ్లు, పండ్లు తినడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు. ఇక ప్రాక్టీస్‌ చేసేప్పుడు మాత్రం పండ్లరసాలు ఎక్కువగా తీసుకుంటాడు. ఏ దేశంలో పోటీలకు హాజరైతే.. అక్కడ దొరికే ఆహారాలను తీసుకోవడం నీరజ్‌కు అలవాటు. తాజాగా  తన డైట్‌లోకి సాల్మన్‌ చేపలను కూడా యాడ్‌ చేసుకున్నాడు. ఇక శనివారం సాయంత్రం జరిగిన ఈవెంట్‌లో 87.58 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి పసిడి పతకాన్ని కొల్లగొట్టాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top