
ఈ సీజన్‌పై స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా
వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శన చేస్తానని ఆశాభావం
స్విట్జర్లాండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో కాస్త వెనుకబడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శన చేస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన నీరజ్... ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించడంలో విఫలమయ్యాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నీరజ్... రిక్తహస్తాలతో వెనుదిరిగాడు.
ఈ ఏడాదే 90 మీటర్ల మార్క్ అందుకున్న నీరజ్ చోప్రాకు ఈ సీజన్ మిశ్రమ ఫలితాలనిచ్చిoది. ప్రస్తుతం జ్యూరిక్‌లో శిక్షణ పొందుతున్న 27 ఏళ్ల నీరజ్ చోప్రా... ఈ ఏడాది తన ప్రదర్శన... రానున్న టోర్నీలకు సన్నద్ధతపై ప్రత్యేకంగా మాట్లాడాడు. యూరప్‌లో శిక్షణ, స్విట్జర్లాండ్‌తో ఉన్న అనుబంధం... ఆ దేశ పర్యాటక శాఖ తనను ‘ఫ్రెండ్‌షిప్ అంబాసిడర్’గా నియమించడం వంటి వాటిపై నీరజ్ అభిప్రాయాలు అతడి మాటల్లోనే...

» ఈ సీజన్‌లో చాలా సవాళ్లు ఎదురయ్యాయి. వాటి నుంచి ఎంతో నేర్చుకున్నా. ప్రతీ టోర్నమెంట్ నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఆ అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.
» ప్రతి అంశంలో మెరుగయ్యేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఎప్పటకప్పుడు ప్రేరణ పొందుతూ ముందుకు సాగడమే మన పని.
» తదుపరి సీజన్‌లో మరింత మెరుగైన ప్రదర్శన చేసి బలంగా తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నా. ప్రపంచ చాంపియన్‌షిప్ సమయంలో వెన్నునొప్పితో ఇబ్బందిపడ్డా. ఇప్పుడు శరీరం ఫిట్‌గా ఉంది. రానున్న టోర్నీల్లో దాని ఫలితం తెలుస్తుంది.
» తిరిగి లయ అందుకునేందుకు లుసానే అనువైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి అంటే ఇష్టం. పర్వతాలు, లోయలు మనసుకు ఎంతో అహ్లాదాన్నిస్తాయి. అవి శిక్షణ సమయంలో ఉల్లాసంగా ఉండేందుకు ఉపయోగపడతాయి.
» మండు వేసవిలో సైతం ఇక్కడి పచ్చని వాతావరణం... శీతాకాల భావన కల్పిస్తుంది. ఇక్కడ నాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. 2022లో జ్యూరిక్‌లో గెలిచిన డైమండ్ లీగ్ ట్రోఫీ నాకెంతో ప్రత్యేకం. ఆ తర్వాత 2023 ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం కూడా ఇక్కడే సాధన చేశా... అప్పుడు పసిడి గెలుచుకున్నా.
» డైమండ్ లీగ్ ట్రోఫీ గెలిచిన తర్వాత నా కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడి ప్రదేశాలు సందర్శించా. ఆ అనుభవం ఎన్నో మధురానుభూతులను అందించింది.
» జీవితంలో ప్రతీది అనుకున్నట్లు సాగదని ‘కోవిడ్–19’ మహమ్మారితో తెలిసొచ్చి ంది. అప్పటి నుంచి ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మార్చుకోక తప్పదు.
» స్విట్జర్లాండ్‌లో సమయ పాలన తప్పనిసరి. మనకు నచ్చి న సమయంలో నచ్చి న చోటకు వెళ్లాలంటే కష్టం. ప్రజారవాణా వ్యవ్యస్థ చాలా పకడ్బందీగా ఉంటుంది. అందుకే వీలు ఉన్నప్పుడు పర్యటించేందుకు అనుగుణంగా రైలు పాస్‌ల విషయంలో సహాయం చేయమని స్విట్జర్లాండ్ పర్యాటక శాఖను అడుగుతుంటా.
» స్విట్జర్లాండ్‌తో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నా. నాకు ఇక్కడ చాలా మంది తెలుసు. నా ప్రపంచ అథ్లెటిక్స్ ఏజెంట్లు కూడా స్విస్‌కు చెందిన వారే. యూరప్‌లో ఉంటే ఎక్కువగా స్విట్జర్లాండ్‌లోనే ఉంటాను. దీన్ని రెండో ఇల్లు అని పిలవలేను కానీ... తరచుగా వెళ్లేందుకు ఇష్టపడే ప్రదేశం అని మాత్రం చెప్పగలను.