
టీమిండియా జెర్సీలో తిలక్ వర్మ(ఫైల్ ఫోటో)
టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ ఇంగ్లండ్ డొమాస్టిక్ వన్డే కప్ అరంగేట్రంలో తీవ్ర నిరాశపరిచాడు. మంగళవారం వేల్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా గ్లామోర్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాంప్‌షైర్ తరపున బరిలోకి దిగిన తిలక్.. డకౌట్‌గా వెనుదిరిగాడు.
మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. పేసర్ నెడ్ లియోనార్డ్ బౌలింగ్‌లో అస ట్రైబ్‌కు క్యాచ్ ఇచ్చి ఈ హైదరాబాదీ ఔటయ్యాడు. అయితే అంతకుముందు కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో తిలక్ అదరగొట్టాడు. 4 మ్యాచ్‌లలో హాంప్‌షైర్ తరపున తిలక్ 358 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన గ్లామోర్గాన్ కెప్టెన్ కిరణ్ కార్ల్సన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన హాంప్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
హాంప్‌షైర్ కెప్టెన్ గుబ్బిన్స్(144) భారీ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు బెన్ మేయస్(74), ఓర్(45) రాణించారు. గ్లామోర్గాన్ బౌలర్లలో నెడ్ లియోనార్డ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనలో గ్లామోర్గాన్ 28 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.