ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ల బుకింగ్ ఎప్పటినుంచంటే?.. ధర ఎంతంటే? | Tickets For ICC Champions Trophy 2025 Matches In Pakistan To Go On Sale On January 28, Know Price Details Inside | Sakshi
Sakshi News home page

CT 2025 Tickets Sale: ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ల బుకింగ్ ఎప్పటినుంచంటే?.. ధర ఎంతంటే?

Jan 27 2025 8:22 PM | Updated on Jan 28 2025 9:08 AM

Tickets for ICC Champions Trophy matches in Pakistan to go on sale on January 28

క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి 25 రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా పాకిస్తాన్‌, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ ​మెగా టోర్నీ షురూ కానుంది.  ఇక ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన టిక్కెట్ల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసీ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబీ) సోమవారం(జనవరి 27) వెల్లడించాయి.

ఈ టోర్నీ గ్రూపు స్టేజి మ్యాచ్‌లు, పాకిస్తాన్‌లో జరిగే రెండవ సెమీఫైనల్ టిక్కెట్లు మంగళవారం(జనవరి 28)  మధ్యాహ్నం 02:00 గంటల నుంచి అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. పాక్‌లోని మొత్తం మూడు వేదికలలోని 10 మ్యాచ్‌ల సాధారణ స్టాండ్‌ల టిక్కెట్‌ల ధర 1000 పాకిస్తాన్ రూపాయలు (భారత కరెన్సీ ప్రకారం రూ.310)గా నిర్ణయించారు. 

అదే విధంగా ప్రీమియర్ సీటింగ్ టిక్కెట్‌ల ధర  1,500 పాకిస్తాన్ రూపాయలు (భారత కరెన్సీ ప్రకారం రూ.310)గా ఉన్నాయి. అన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు తమ  ఫిజికల్ టిక్కెట్లను ఫిబ్రవరి 3 నుండి పాకిస్తాన్‌లోని ఎంపిక చేసిన టీసీఎస్‌ ఎక్స్‌ప్రెస్ కేంద్రాలలో పొందాలి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ)లో భారత్ ఆడే మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ల వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

కాగా ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆడనుంది. మిగితా మ్యాచ్‌లన్నీ పాక్‌లో జరగనున్నాయి. ఈ టోర్నీలో ఫిబ్రవరి 19 న మొదలై మార్చి 9న ఫైనల్‌తో ముగియనుంది. టీమిండియా ఫైనల్‌కు ఆర్హత సాధిస్తే.. ఆ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరగనుంది. 

ఈ ఐసీసీ ఈవెంట్‌లో  8 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. అందులో గ్రూప్‌-ఏలో పాకిస్థాన్, భారత్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్‌-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్‌, ఇంగ్లండ్‌లు ఉన్నాయి. 

ఒక్కో గ్రూపు నుంచి టాప్-2లో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్‌కు ఆర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో అమీతుమీ తెల్చుకోనుంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ట్రావెలింగ్‌ రిజర్వ్స్‌: వరుణ్‌ చక్రవర్తి, ఆవేశ్‌ ఖాన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి
చదవండి: ఆమె నాకు చెల్లెలు లాంటిది.. డేటింగ్‌ వార్తలపై సిరాజ్‌ రియాక్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement