ఐపీఎల్‌ 2020: ‘త్రీ’ వర్సెస్‌ ‘ఫోర్‌’

Three Time Champion Vs Four Times Champion In IPL 2020 Opener - Sakshi

ముంబై వర్సెస్‌ సీఎస్‌కేల మధ్య తొలి మ్యాచ్‌

ముంబై ఇండియన్స్‌.. ఓ చెత్త రికార్డు

ఆరంభంలో పేలవం.. చివర్లో వీరోచితం

అబుదాబి: క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-13 సీజన్‌ వచ్చేసింది. కరోనా సంక్షోభంలో సైతం అభిమానులకు మజాను అందించడానికి సన్నద్ధమైంది క్యాష్‌ రిచ్‌ లీగ్‌. టీమిండియా సభ్యులు తమ సహచరులపైనే కత్తులు దూసేందుకు ప్రతీ ఏడాదిలాగే సిద్ధమైపోయారు.  హీటెక్కించే వేడిలో పరుగుల ఆట ప్రారంభం కావడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. ఇందులో ముంబై ఇండియన్స్‌ నాలుగుసార్లు టైటిల్‌ను సొంతం చేసుకోగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడుసార్లు విజేతగా నిలిచింది. అత్యధిక టైటిల్స్‌ను గెలిచిన జాబితాలో ముంబై తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో చెన్నైనే ఉంది. ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది.(చదవండి: ఐపీఎల్‌ వీరులు వీరే.. ఈసారి ఎవరో?)

గతేడాది ఐపీఎల్‌ ఫైనల్స్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్‌ తమ అద్భుత రికార్డును కొనసాగించింది. మూడో సారి కూడా ధోని సేనను చిత్తు చేసి ఐపీఎల్‌ –2019 విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా నాలుగోసారి టైటిల్‌ నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఒక్క పరుగుతో చాంపియన్‌గా నిలిచిన రోహిత్‌ సేన చాంపియన్‌గా నిలిచింది. ముంబై ఇండియన్స్‌ 2019తో పాటు, 2017, 2015, 2013ల్లో ఐపీఎల్‌ టైటిల్‌ను అందుకుంది. ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2018, 2011, 2010ల్లో ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది. త్రీ టైమ్‌ చాంపియన్‌ వర్సెస్‌ ఫోర్‌ టైమ్స్‌ చాంపియన్‌ల మధ్య అబుదాబి వేదికగా తొలి మ్యాచ్‌ జరుగనుంది.(చదవండి: ఐపీఎల్‌.. బలాబలాలు తేల్చుకుందాం!)

ముంబై వెంటాడుతున్న చెత్త రికార్డు
ముంబై ఇండియన్స్‌ను ఓ చెత్త రికార్డు వేధిస్తోంది.  ఆరంభంలో పేలవం.. మధ్యలో మధ్యస్తం. చివర్లో వీరోచితం.. ఇది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌‌  శైలి‌. ఆటలోనే కాదు టైటిల్స్‌‌ నెగ్గడంలోనూ ఇదే తీరు కనబడుతోంది. ముంబై 2013 సీజన్ నుంచి ఇప్పటి వరకు తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించలేదు. ఇప్పుడిదే ఆ జట్టును, అభిమానులను కలవరపెడుతుంది. ఐపీఎల్‌ -2020 సీజన్‌ తొలి మ్యాచ్‌లో ముంబై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ ముంబైను తొలి మ్యాచ్‌(ముంబై తలపడిన తొలి మ్యాచ్‌)లో ఓటమి  గత ఏడు సీజన్ల నుంచి వేధిస్తోంది. గత ఏడు సీజన్లుగా తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించలేకపోయింది. చివరిసారిగా ముంబై తమ తొలి  మ్యాచ్‌ను 2012లో చెన్నై సూపర్ కింగ్స్‌పై నెగ్గింది.  కానీ చివర్లో ఇరగదీసే ముంబై ఇండియన్స్‌ నాలుగు టైటిల్స్‌ను ఖాతాలో వేసుకుంది. తొలి ఐదు సీజన్లలో ఒకేసారి ఫైనల్‌ వరకూ వచ్చిన ముంబై.. ఆ తర్వాత ఏడు సందర్భాల్లో ఏకంగా నాలుగు టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ముంబై సాధించిన నాలుగు టైటిల్స్‌ కూడా రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో వచ్చాయి.(చదవండి: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీవర్‌.. సక్సెస్‌ ఫియర్‌)

(చదవండి: ఇండియన్‌ పండుగ లీగ్‌...  )

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top