మియామి బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న భారత ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్‌ | Team India Cricketers Chill On Miami Beach Ahead Of 4th T20I | Sakshi
Sakshi News home page

IND vs WI: మియామి బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న భారత ఆటగాళ్లు.. ఫోటోలు వైరల్‌

Aug 5 2022 7:45 PM | Updated on Aug 5 2022 8:29 PM

Team India Cricketers Chill On Miami Beach Ahead Of 4th T20I - Sakshi

భారత్‌, వెస్టిండీస్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖరి రెండు టీ20లు ఫ్లోరిడా  వేదికగా జరగనున్నాయి. ఇరు జట్లు మధ్య నాలుగో టీ20 శనివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను వీసా సమస్య వెంటాడుతోంది. వీసా సమస్య కారణంగా గయనా నుంచి కొంత మంది టీమిండియా ఆటగాళ్లు మాత్రమే ప్లోరిడాకు గరువారం చేరుకున్నారు.

మరి కొంతమంది శుక్రవారం ఫ్లోరిడాకు చేరుకోనున్నట్లు సమాచారం. అయితే తొలుత యునైటెడ్ స్టేట్స్ చేరుకున్న హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి భారత ఆటగాళ్లు మియామి బీచ్‌ల్లో తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్లోరిడా రాష్ట్రంలో మియామి అతి సుందరమైన నగరం. మియామిలోని ఆహ్లాదాన్ని పంచే అందమైన బీచ్‌లు చాలా ప్రసిద్దిగాంచాయి. కాగా ఇరు జట్లు మధ్య మూడో టీ20 మం‍గళవారం ముగిసిన తర్వాత శనివారం వరకు మ్యాచ్‌ లేకపోడవంతో ఆటగాళ్లు అక్కడి బీచ్‌ల్లో సేదతీరుతున్నారు.

వీరి ముగ్గురితో పాటు కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ కూడా బీచ్‌ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆటగాళ్లు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేశారు. దీంతో ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో లీడ్‌లో ఉంది. మరోవైపు విండీస్‌తో మూడో టీ20లో గాయపడిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ సాధించాడు. దాంతో అతడు ఆఖరి రెండు టీ20లకు కూడా అందుబాటులో ఉండనున్నాడు.


చదవండి: IND vs WI: ఉత్కంఠ రేపుతున్న వీసా సమస్య.. ఫ్లోరిడాకు చేరుకోని భారత ఆటగాళ్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement