IND Vs NZ: రోహిత్‌ శర్మకే సందేహం వచ్చేలా..

T20 World Cup 2021: Gavaskar Comments Rohit Sharma Batting Order Change Vs NZ - Sakshi

Sunil Gavaskar Comments About Rohit Sharma Batting Order Change.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రెగ్యులర్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మను వన్‌డౌన్‌లో దించడం ద్వారా భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పొరపాటు చేసిందని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ద్వారా బౌల్ట్‌ను ఎదుర్కోలేవనే సంకేతాలు రోహిత్‌కు ఇచ్చినట్లయిందని... ఇది అతని సత్తాపై అతనికే సందేహాలు కల్పించేలా చేసిందన్నారు. నిలకడలేని ఇషాన్‌ కిషన్‌ను ఓపెనింగ్‌ స్థానంలో కాకుండా 4 లేదంటే 5వ స్థానంలో దించాల్సిందని సన్నీ పేర్కొన్నారు.

ఇక పాకిస్తాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ " షాహిన్‌ లాగే యార్కర్‌లు వేసి టీమిండియాను ఇబ్బందిపెడుతా.. అంటూ కామెంట్‌ చేశాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారుంటాడని పలువురు పేర్కొనడం ఆసక్తి కలిగించింది.

చదవండి: IND Vs NZ: ఔట్‌ నుంచి తప్పించుకున్న రోహిత్‌.. రితికా శర్మ రియాక్షన్‌

రోహిత్‌ శర్మ గోల్డెన్‌ డక్‌.. ఏంటయ్యా ఇది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top