SL Vs AUS: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. కరోనాతో స్టార్‌ బౌలర్‌ దూరం

T20 WC 2022 SL VS AUS: AUS Won The Toss And Choose To Bowl  - Sakshi

టీ20 వరల్డ్‌ కప్‌-2022 సూపర్‌-12 గ్రూప్‌-1 మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 25) ఆస్ట్రేలియా-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. పెర్త్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించిన శ్రీలంక రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తుండగా.. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చావుదెబ్బ తిన్న ఆసీస్‌ విజయ దాహంతో రంకెలేస్తుంది.

సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. కరోనా బారిన పడిన ఆడమ్‌ జంపా స్థానంలో ఆస్టన్‌ అగర్‌ జట్టులోకి రాగా.. శ్రీలంక గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. 

తుది జట్లు..
ఆస్ట్రేలియా: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టోయినిస్‌, టిమ్‌ డేవిడ్‌, మాథ్యూ వేడ్‌, పాట్‌ కమిన్స్‌, ఆస్టన్‌ అగర్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌

శ్రీలంక: పథుమ్‌ నిస్సంక, కుశాల్‌ మెండిస్‌, ధనంజయ డిసిల్వా, చరిత్‌ అసలంక, భానుక రాజపక్ష, దసున్‌ శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్‌ తీక్షణ, బినుర ఫెర్నాండో, లహీరు కుమార

 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top