Eng Vs IRE: ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌.. ఐర్లాండ్‌ విజయం

T20 WC 2022 England vs Ireland: Toss Playing XI Details Updates - Sakshi

ICC Mens T20 World Cup 2022 - England vs Ireland: టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌ తగిలింది.  వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం ఐర్లాండ్‌.. ఇంగ్లండ్‌ మీద 5 పరుగుల తేడాతో గెలుపొందింది.

మ్యాచ్‌ స్కోర్లు:
ఐర్లాండ్‌ 157 (19.2)
ఇంగ్లండ్‌ 105/5 (14.3)

వరణుడు మరోసారి
ఉత్కంఠగా సాగుతున్న ఇంగ్లండ్‌- ఐర్లాండ్‌ మ్యాచ్‌కు వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. ఇంగ్లండ్‌ గెలవాలంటే 33 బంతుల్లో 53 పరుగులు అవసరమైన వేళ.. అలీ, లివింగ్‌స్టోన్‌ క్రీజులో ఉన్న సమయంలో వర్షం పడింది. దీంతో కాసేపు ఆటను ఆపారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
మలన్‌ రూపంలో ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 

పెరుగుతున్న రన్‌రేటు
13 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోరు: 86/4

నాలుగో వికెట్‌ డౌన్‌
హ్యారీ బ్రూక్‌ రూపంలో ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. డాక్‌రెల్‌ బౌలింగ్‌లో డెలనీకి క్యాచ్‌ ఇచ్చి అతడు అవుటయ్యాడు. మలన్‌, అలీ క్రీజులో ఉన్నారు. స్కోరు- 68-4(11)

10 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోరు: 63/3

మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. స్టోక్స్‌ క్లీన్‌ బౌల్డ్‌
29 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఫియాన్‌ హ్యాండ్‌ బౌలింగ్‌లో బెన్‌ స్టోక్స్‌ (6) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 6 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 37/3. డేవిడ్‌ మలాన్‌, హ్యారీ బ్రూక్‌ క్రీజ్‌లో ఉన్నారు.  

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
జాషువా లిటిల్‌ మరోసారి అద్భుతం చేశాడు. అతడి బౌలింగ్‌లో హేల్స్‌ అడేర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 3 ఓవర్లలో స్కోరు: 14/2

ఆదిలోనే భారీ షాక్‌
ఇంగ్లండ్‌ జట్టుకు జాషువా లిటిల్‌ ఆదిలోనే భారీ షాకిచ్చాడు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్‌ బట్లర్‌ను పెవిలియన్‌కు పంపాడు. మొదటి ఓవర్‌ ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోరు: 2/1. మలన్‌, అలెక్స్‌ హేల్స్‌ క్రీజులో ఉన్నారు.

ఐర్లాండ్‌ స్కోరెంతంటే!
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 19.2 ఓవర్లలో 157 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఐరిష్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ ఆండ్రూ బిల్బిర్నీ 62 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లివింగ్‌స్టోన్‌కు మూడు, సామ్‌ కర్రాన్‌కు రెండు, మార్క్‌వుడ్‌కు మూడు, బెన్‌స్టోక్స్‌కు ఒక వికెట్‌ దక్కాయి.

వరుస వికెట్లు
సామ్‌ కర్రాన్‌ అద్భుత బంతితో మెకార్తీ, ఫియోన్‌ హాండ్‌లను బౌల్డ్‌ చేశాడు. దీంతో 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

ఏడో వికెట్‌ కోల్పోయిన ఐర్లాండ్‌
లివింగ్‌స్టోన్‌ బౌలింగ్‌లో మార్క్‌ అడేర్‌ ఏడో వికెట్‌(150-7)గా వెనుదిరిగాడు.

ఆరో వికెట్‌ డౌన్‌
కాంఫర్‌ రూపంలో ఐర్లాండ్‌ ఆరో వికెట్‌ ​కోల్పోయింది. 17 ఓవర్లలో స్కోరు - 144/6.

వరుసగా రెండు వికెట్లు
లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. 16 ఓవర్‌ మూడో బంతికి బల్బిర్నీ, నాలుగో బంతికి డాక్‌రెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఐర్లాండ్‌ ఐదు వికెట్లు(133-5) కోల్పోయింది. 

15 ఓవర్లలో ఐర్లాండ్‌ స్కోరు- 127/3

డకౌట్‌గా వెనుదిరిగిన టెక్టర్‌
మార్క్‌ వుడ్‌ మరోసారి దెబ్బకొట్టాడు. అతడి బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి టెక్టర్‌ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. కాంఫర్‌- బెల్బిర్నీ క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఐర్లాండ్‌
ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో టక్కర్‌ రనౌట్‌గా అయ్యాడు. 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్‌ స్కోరు: 103-2

పది ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్‌ స్కోరు: 92/1 (10)

ఆచితూచి ఆడుతున్న కెప్టెన్‌
ఆండ్రూ బెల్బిర్నీ (19)ఆచితూచి ఆడుతుండగా.. టక్కర్‌(16 బంతుల్లో 26) ధాటిగా ఆడుతున్నాడు. 7 ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్‌ చేసిన పరుగులు ఒక వికెట్‌ నష్టానికి 65.

ఐదు ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్‌ స్కోరు: 45-1

తొలి వికెట్‌ కోల్పోయిన ఐర్లాండ్‌
ఆదిలోనే ఐర్లాండ్‌కు భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌.. మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి ఐర్లాండ్‌ స్కోరు:  26-1. బెల్బిర్నీ, టక్కర్‌ క్రీజులో ఉన్నారు

ఆట మొదలైంది
వర్షం తెరిపి ఇవ్వడంతో ఇంగ్లండ్‌- ఐర్లాండ్‌ మధ్య ఆట మొదలైంది. స్కోరు: 

టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ సూపర్‌-12లో భాగంగా గ్రూప్‌ 1లో ఉన్న ఇంగ్లండ్‌- ఐర్లాండ్‌ మధ్య మ్యాచ్‌కు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ)వేదికైంది. ఎంసీజీలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే, మ్యాచ్‌ ఆరంభమైన కాసేపటికే వరుణుడు ఆటంకం కలిగించాడు. 

ఇక వర్షం పడే సమయానికి ఐర్లాండ్‌ స్కోరు 1.3 ఓవర్లలో 11/0గా ఉంది. కెప్టెన్‌ ఆండ్రూ బెల్బిర్నీ 2, పాల్‌ స్టిర్లింగ్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

తుది జట్లు:
ఐర్లాండ్‌:
పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బెల్బిర్నీ (కెప్టెన్‌), లోర్కాన్ టక్కర్(వికెట్‌ కీపర్‌), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, ఫియోన్ హ్యాండ్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్.

ఇంగ్లండ్‌
జోస్ బట్లర్ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

చదవండి: T20 WC 2022: ఆ విషయంలో టీమిండియా ఆటగాళ్ల తీవ్ర అసంతృప్తి?.. కానీ ఐసీసీ మాత్రం అంతే!
WC 2022: పాక్‌తో మ్యాచ్‌లో విఫలం.. అందరి దృష్టి అతడిపైనే! నెట్స్‌లో తీవ్ర సాధన! పసికూనతో అయినా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top