IND Vs SL T20 Series: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో సూర్యకుమార్‌ ఔట్‌

Suryakumar Yadav Ruled Out T20 Series Vs SL Due To Hand Fracture - Sakshi

లంకతో టి20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లు వరుస గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌లు దూరమవ్వగా..  దీపక్‌ చహర్ కూడా తొడ కండరాల గాయంతో లంకతో టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా గాయంతో దూరమైనట్లు తెలుస్తోంది.

లంకతో సిరీస్‌కు సిద్ధమైన సూర్య మంగళవారం లక్నోలో ప్రాక్టీస్‌ సెషన్‌లో కనిపించినప్పటికి కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. చేతికి ప్రాక్చర్‌ అయినట్లు తేలడంతో లంకతో టి20 సిరీస్‌కు అతన్ని దూరంగా ఉంచనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.కాగా దెబ్బ ఎక్కడ తగిలిందనే విషయంపై స్పష్టత రాలేదు. బహుశా విండీస్‌తో మూడో టి20లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలోనే సూర్యకుమార్‌ చేతికి గాయమై ఉంటుంది. అయితే చేతికి బ్యాండేజీ వేసుకోకపోవడంతో గాయం తీవ్రత పెద్దగా కనిపించలేదు. కాగా రెస్ట్‌ పేరుతో కోహ్లి, రిషబ్‌ పంత్‌లు టి20 సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ విండీస్‌తో టి20 సిరీస్‌లో విశేషంగా రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. మూడో టి20లో 31 బంతుల్లోనే 7 సిక్సర్లు, ఒక ఫోర్‌ సాయంతో 65 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కాగా మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. సూర్యకుమార్‌ గైర్హాజరీలో శ్రేయాస్‌ అయ్యర్‌ మిడిలార్డర్‌లో కీలకం కానున్నాడు. 

చదవండి: IND Vs SL: గాయంతో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దూరం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top