విఫలమవుతున్నా నెంబర్‌వన్‌ స్థానంలోనే.. | Sakshi
Sakshi News home page

Suryakumar: విఫలమవుతున్నా నెంబర్‌వన్‌ స్థానంలోనే..

Published Wed, Apr 12 2023 7:51 PM

Suryakumar Yadav Continues To Lead ICC T20 Batter Rankings - Sakshi

టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ టి20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ స్థానాన్ని నిలుపుకున్నాడు. బుధవారం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ విభాగంలో సూర్యకుమార్‌ 906 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. తర్వాతి స్థానంలో పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(811 పాయింట్లు) ఉన్నాడు.

ఇక మూడో స్థానంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(755 పాయింట్లు), సౌతాఫ్రికా స్టార్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ 748 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. 745 పాయింట్లతో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డెవాన్‌ కాన్వే ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లి 15వ స్థానంలో ఉండగా.. మిగతా టీమిండియా బ్యాటర్లు ఎవరు టాప్‌-20లో చోటు దక్కించుకోలేకపోయారు.

అయితే ఇటీవలే ప్రారంభమైన ఐపీఎల్‌ 16వ సీజన్‌లోనూ సూర్యకుమార్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 12,1,0 పరుగులు చేశాడు. ఇందులో ఒక గోల్డెన్‌ డక్‌ కూడా ఉంది. అయితే సూర్య నెంబర్‌వన్‌ స్థానంలో కొనసాగాడానికి మ్యాచ్‌లు అంతర్జాతీయంగా మ్యాచ్‌లు జరగకపోవడమే. ఇక పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ మధ్య ప్రారంభమవనున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌తో ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. సూర్య వెనకాలే ఉన్న మహ్మద​ రిజ్వాన్‌, బాబర్‌ ఆజంలు సిరీస్‌లో రాణిస్తే సూర్యను దాటే చాన్స్‌ ఉంది.

ఇక బౌలింగ్‌ విభాగంలో అఫ్గానిస్తాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తొలి స్థానంలో ఉండగా.. ఫజల్లా ఫరుకీ రెండు, జోష్‌ హాజిల్‌వుడ్‌ మూడు, వనిందు హసరంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి ఒక్క బౌలర్‌ కూడా టాప్‌-10లో చోటు దక్కించుకోవడం గమనార్హం.

చదవండి: మైదానంలోనే కాదు.. డ్రెస్సింగ్‌రూమ్‌లోనూ మనోడే హీరో!

Advertisement
 
Advertisement