సునీల్‌ నరైన్‌ విధ్వంసకర సెంచరీ.. 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో | Sunil Narine slams his maiden T20 ton | Sakshi
Sakshi News home page

#Sunil Narine: సునీల్‌ నరైన్‌ విధ్వంసకర సెంచరీ.. 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో! వీడియో

Apr 16 2024 9:22 PM | Updated on Apr 17 2024 9:34 AM

Sunil Narine slams maiden T20 ton - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా  ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ అద్బతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో నరైన్ విధ్వంసం సృష్టించాడు. నరైన్‌ రాజస్తాన్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడిని ఆపడం రాజస్తాన్‌ బౌలర్ల తరం కాలేదు.

ఈ క్రమంలో కేవలం 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొన్న సునీల్‌.. 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. కాగా నరైన్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం.

అదేవిధంగా ఐపీఎల్‌ సెంచరీ చేసిన మూడో కేకేఆర్‌ ఆటగాడిగా నరైన్‌ రికార్డులకెక్కాడు. అంతేకాకుండా ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన రెండో ఆటగాడిగా నరైన్‌(109) నిలిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(158) తొలి స్ధానంలో ఉన్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. కేకేఆర్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌(109)తో పాటు రఘువంశీ(30), రింకూ సింగ్‌(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో అవేష్‌ఖాన్‌, కుల్దీప్‌ సేన్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. చాహల్‌, బౌల్ట్‌ తలా వికెట్‌ పడగొట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement