
గ్రెనడా వేదికగా వెస్టిండీస్‌తో రెండో టెస్టులో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. గురువారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయాలని కంగారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా టీమ్‌మెనెజ్‌మెంట్ తమ ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించింది.
చేతివేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి గ్రెనడా టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. స్మిత్ రాకతో వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్‌పై వేటు పడింది. తొలి టెస్టులో అవకాశం లభించినప్పటికి ఇంగ్లిష్ ఉపయోగించుకోలేకపోయాడు.
అదేవిధంగా బార్బడోస్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమైన సామ్ కాన్‌స్టాస్, ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌లకు ఆసీస్ టీమ్‌మెనెజ్‌మెంట్ మరో అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా తమ బౌలింగ్ లైనప్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. స్టార్క్, హాజిల్‌వుడ్, కమ్మిన్స్ ఆసీస్ ఫ్రంట్‌లైన్ పేసర్లగా ఉన్నారు.
వీరితో పాటు నాలుగో పేసర్‌గా ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ బంతిని పంచుకోనున్నాడు. ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్‌లో నాథన్ లియాన్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్నాడు. తొలి టెస్టులో 159 పరుగుల తేడాతో విండీస్‌ను కమ్మిన్స్ సేన చిత్తు చేసింది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్ 2025-27లో ఆసీస్ బోణీ కొట్టింది.
విండీస్‌తో రెండో టెస్టుకు ఆసీస్ తుది జట్టు
ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్
చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. తొలి భారత ప్లేయర్‌గా