శ్రీలంక క్రికెట్‌ జట్టు వీరాభిమాని మృతి.. సంతాపం తెలిపిన దిగ్గజ క్రికెటర్లు | Sri Lanka crickets Super Fan Uncle Percy passes away aged 87 | Sakshi
Sakshi News home page

శ్రీలంక క్రికెట్‌ జట్టు వీరాభిమాని మృతి.. సంతాపం తెలిపిన దిగ్గజ క్రికెటర్లు

Oct 30 2023 8:09 PM | Updated on Oct 30 2023 8:18 PM

Sri Lanka crickets Super Fan Uncle Percy passes away aged 87 - Sakshi

శ్రీలంక క్రికెట్‌ జట్టు వీరాభిమాని పెర్సీ అబేశేఖర(87) ‍కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అందరూ అబేశేఖరను ముద్దుగా "అంకుల్ పెర్సీ" అని పిలుచుకునేవారు. శ్రీలంక జట్టు ఎక్కడ ఆడిన ఆయన స్టేడియంకు వచ్చి సపోర్ట్‌ చేసేవాడు.

1979 ప్రపంచ కప్ నంచి తన జట్టును ఉత్సాహపరిస్తూ అబేశేఖర వచ్చారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత స్టేడియాల్లో అంకుల్ పెర్సీ శ్రీలంక జాతీయ జెండాను రెపరెపలాడించేవారు. గతేడాది వరకు జట్టుతోనే కలిసి ప్రయాణం చేసిన అంకుల్ పెర్సీ.. అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమతయ్యారు.

ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో వైద్య ఖర్చుల కోసం రూ.50 లక్షల చెక్‌ను శ్రీలంక క్రికెట్‌ బోర్డు అబేశేఖరకు అందించింది. అదే విధంగా ఈ ఏడాది ఆసియాకప్‌ సందర్భంగా  టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా  అబేశేఖరను తన నివాసంలో కలిశారు. కాగా ఆయన మృతిపట్ల శ్రీలంక దిగ్గజాలు  సనత్ జయసూర్య, రస్సెల్ ఆర్నాల్డ్ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.
చదవండి: World Cup 2023: పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో వివాదం.. బాబర్‌ ఆజం ప్రైవేట్ వాట్సాప్‌ చాట్‌ లీక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement