
శ్రీలంక వేదికగా జరిగే లంక ప్రీమియర్ లీగ్ (Lanka Premier League) ఆరో ఎడిషన్‌కు సిద్దమైంది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 23 వరకు జరుగనుంది. లీగ్ చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘంగా సాగనున్న ఎడిషన్. ఈ ఎడిషన్ మొత్తం 24 రోజుల పాటు జరుగుతుంది.
ఇందులో 20 లీగ్ స్టేజీ మ్యాచ్‌లు, 4 నాకౌట్ మ్యాచ్‌లు సహా మొత్తం 24 మ్యాచ్‌లు జరుగుతాయి. 5 ఫ్రాంచైజీలు పాల్గొనే ఈ లీగ్ కోసం మూడు వేదికలు ఇదివరకే సిద్దం చేయబడ్డాయి.
కొలొంబోని ప్రేమదాస స్టేడియం, క్యాండీలోని పల్లెకెలె స్టేడియం, డంబుల్లాలోని రణగిరి స్టేడియం ఎల్‌పీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.
తొలిసారి భారత ప్లేయర్లు
ఈ లీగ్‌లో తొలిసారి భారత ప్లేయర్లు పాల్గొననున్నారని తెలుస్తుంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని సమాచారం. బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో పాల్గొనలేరు. రిటైర్డ్ ఆటగాళ్లు, నాన్ కాంట్రాక్ట్ ప్లేయర్లు, బీసీసీఐతో సంబంధాలు తెంచుకున్న ఆటగాళ్లకు మాత్రం ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది.
వీరు కూడా బీసీసీఐ నుంచి నామమాత్ర అనుమతి తీసుకోవాలి. లంక ప్రీమియర్ లీగ్ అధికారుల అభ్యర్థన మేరకు కొందరు నాన్ కాంట్రాక్ట్ ఆటగాళ్లను లంక ప్రీమియర్ లీగ్ 2025లో పాల్గొనేందుకు బీసీసీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
వీరిలో టీమిండియా మాజీ ప్లేయర్లు, ఐపీఎల్ స్టార్లు సురేశ్ రైనా, యూసప్ పఠాన్, మనోజ్ తివారి, రాహుల్ శర్మ తదితర ఆటగాళ్లు ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
కాగా, భారత క్రికెట్‌తో పూర్తిగా బంధాన్ని తెంచుకున్న దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే ఇంటర్నేషనల్ టీ20 లీగ్, బిగ్‌బాష్ లీగ్‌లతో ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్