చెలరేగిన మనీష్‌ పాండే

SRH Beat Rajasthan By 8 Wickets - Sakshi

దుబాయ్‌: రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘన విజయం సాధించింది. రాజస్తాన్‌ నిర్దేశించిన 155 పరుగుల టార్గెట్‌ను 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరెంజ్‌ ఆర్మీలో డేవిడ్‌ వార్నర్‌(4), బెయిర్‌ స్టో(10)లు నిరాశపరిచినా మనీష్‌ పాండే(83 నాటౌట్‌; 47 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), విజయ్‌ శంకర్‌( 52 నాటౌట్‌; 51 బంతుల్లో 6 ఫోర్లు)లు మరో వికెట్‌ పడకుండా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. తొలి మూడు ఓవర్లలోపే వార్నర్‌, బెయిర్‌ స్టో వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్‌లు ఆదుకున్నారు.(గంభీర్‌.. ఇప్పుడేమంటావ్‌?)

వార్నర్‌, బెయిర్‌ స్టోలను ఆదిలోనే జోఫ్రా ఆర్చర్‌ ఔట్‌ చేసి గట్టి దెబ్బకొట్టాడు. కానీ మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్‌లు సమయోచితంగా ఆడటంతో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. ముఖ్యంగా మనీష్‌ పాండే చెలరేగి ఆడాడు.  ఫోర్లు, సిక్స్‌లతో బౌండరీల మోత మోగించాడు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్‌ తిరిగా గాడిలో పడింది. మనీష్‌కు విజయ్‌ శంకర్‌ నుంచి చక్కటి సహకారం లభించడంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు తిరుగులేకుండా పోయింది. ఈ జోడి అజేయంగా 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఆరంభంలో మినహా ఏ దశలోనూ రాజస్తాన్‌ నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌కు పోటీ ఎదురుకాలేదు. ఈ మ్యాచ్‌లో విజయంతో తొలి అంచె మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ఓటమికి  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. ఇది సన్‌రైజర్స్‌కు నాల్గో విజయం కాగా, రాజస్తాన్‌కు ఏడో ఓటమి.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో రాజస్తాన్‌ బ్యాటింగ్‌కు దిగింది. రాజస్తాన్‌ రాయల్స్‌ను రాబిన్‌ ఊతప్ప,  బెన్‌ స్టోక్స్‌లు ఆరంభించారు. కాగా, రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ నాల్గో ఓవర్‌ మూడో బంతికి ఊతప్ప(19; 13 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్‌) రనౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత బెన్‌ స్టోక్స్‌-సంజూ శాంసన్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ 56 పరుగులు జత చేసిన తర్వాత శాంసన్‌(36; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్‌ దూకుడుగా వెళ్లకుండా నెమ్మదిగా ఆడాడు. (కోహ్లి రెండు పరుగులు.. వాటిని పరిగణిస్తారా?)

కాగా, హోల్డర్‌ వేసిన 12 ఓవర్‌లో నాల్గో బంతికి శాంసన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో రాజస్తాన్‌ 86 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. అదే స్కోరు వద్ద స్టోక్స్‌(30; 32 బంతుల్లో 2ఫోర్లు) పెవిలియన్‌ చేరాడు. రషీద్‌ ఖాన్‌ వేసిన 13 ఓవర్‌ తొలి బంతికి స్టోక్స్‌ బౌల్డ్‌ అయ్యాడు. జోస్‌ బట్లర్‌(9), స్టీవ్‌ స్మిత్‌(19)లు నిరాశపరిచారు. విజయ్‌ శంకర్‌ బౌలింగ్‌లో  బట్లర్‌ ఔట్‌ కాగా, హోల్డర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ ఔటయ్యాడు. హోల్డర్‌ వేసిన 19 ఓవర్‌ తొలి బంతికి భారీ షాట్‌కు యత్నించిన స్మిత్‌.. బౌండరీ లైన్‌ వద్ద మనీష్‌ పాండే క్యాచ్‌ పట్టడంతో నిష్క్రమించాడు. అదే ఓవర్‌ రెండో బంతికి రియాన్‌ పరాగ్‌(20; 12 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్‌) ఔటయ్యాడు. భారీ షాట్‌ ఆడే యత్నంలో వార్నర్‌ క్యాచ్‌ పట్టడంతో పరాగ్‌  ఔటయ్యాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్‌(16 నాటౌట్‌;  7 బంతుల్లో 1 ఫోర్‌, 1సిక్స్‌) బ్యాట్‌ ఝుళిపించడంతో 150 పరుగుల మార్కును దాటింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన జేసన్‌ హోల్డర్‌ మూడు వికెట్లతో మెరిశాడు. విలియమ్సన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన హోల్డర్‌ తనపాత్రకు న్యాయం చేసి రాజస్తాన్‌ను కట్టడి చేయడంలో సహకరించాడు. విజయ్‌ శంకర్‌, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-05-2021
May 07, 2021, 11:05 IST
న్యూఢిల్లీ: ఇటీవల ఆటగాళ్లకి కరోనా వైరస్‌ సోకడంతో అనూహ్యంగా ఐపీఎల్‌ 2021 ని బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, ఆటగాళ్లను బయోబబుల్‌లో...
04-04-2021
Apr 04, 2021, 19:54 IST
ముంబై: ఐపీఎల్‌-14వ సీజన్‌ ఇంకా మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న తరుణంలో ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం...
31-01-2021
Jan 31, 2021, 01:31 IST
ముంబై: ఐపీఎల్‌–2021ను నిర్వహించే విషయంలో ప్రత్యామ్నాయ వేదిక గురించి అసలు తాము ఏమాత్రం ఆలోచించడం లేదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్‌...
05-01-2021
Jan 05, 2021, 14:47 IST
ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌ అజిత్‌ సింగ్‌ ధ్రువీకరించారు.
21-12-2020
Dec 21, 2020, 14:23 IST
మన రాష్ట్రంలో 41 శాతం మంది మాత్రమే దీని ఆరా తీశారు. తెలంగాణలో మన కంటె ఒక్క శాతం ఎక్కువ...
23-11-2020
Nov 23, 2020, 14:53 IST
ఈ టీ20 లీగ్‌లో 53 రోజులపాటు మొత్తంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా 1800 మందికి...
19-11-2020
Nov 19, 2020, 17:11 IST
టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం కేఎల్‌ రాహుల్‌ పూర్తిస్థాయిలో తన సామర్థ్యాన్ని వినియోగించుకోలేదని అభిప్రాయపడ్డాడు.
17-11-2020
Nov 17, 2020, 18:58 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) ఘోరపరాభవం పొందిన విషయం తెలిసిందే. 2011లో తన స్కిల్స్‌తో టీమిండియాకు ప్రపంచ కప్‌...
15-11-2020
Nov 15, 2020, 19:37 IST
రెండున్నర నెలలపాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన ఐపీఎల్‌ 2020 నిర్వహణకు సంబంధించి యూఏఈకి బీసీసీఐ భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు జాతీయ...
12-11-2020
Nov 12, 2020, 20:06 IST
టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు భారీ షాక్‌ తగిలింది.
12-11-2020
Nov 12, 2020, 05:02 IST
ప్రతీ ఐపీఎల్‌కు ఒక కథ ఉంటుంది... ఈ సారి ఐపీఎల్‌ది అన్నింటికంటే భిన్నమైన కథ... కరోనా ఐపీఎల్‌ను ఆపేస్తుందని అంతా...
11-11-2020
Nov 11, 2020, 12:25 IST
అభిమానులు రవిశాస్త్రి తీరును ఎండగట్టారు. కావాలనే దాదాపేరును ప్రస్తావించలేదని తిట్టిపోస్తున్నారు.
11-11-2020
Nov 11, 2020, 10:26 IST
బెత్తం పట్టుకొని బాగా ఆడమనే రకం కాదు నేను. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే కెప్టెన్‌గా నా పని. అందరూ బాగా...
11-11-2020
Nov 11, 2020, 08:43 IST
కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్, హెడ్‌ కోచ్‌గా అనిల్‌ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది. రాహుల్‌ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు.
11-11-2020
Nov 11, 2020, 04:26 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ అప్రతిహత జైత్రయాత్ర... ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యమైన ఆటతీరును కనబర్చిన ఈ జట్టు...
10-11-2020
Nov 10, 2020, 22:55 IST
దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌  మళ్లీ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. వేదిక ఏదైనా టైటిల్‌ వేటలో తమకు...
10-11-2020
Nov 10, 2020, 21:19 IST
దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 157 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది....
10-11-2020
Nov 10, 2020, 19:59 IST
దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ బౌల్ట్‌ తొలి...
10-11-2020
Nov 10, 2020, 19:10 IST
దుబాయ్‌: ఈ సీజన్‌ ఐపీఎల్‌ టైటిల్‌ కోసం ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. నాలుగు టైటిల్స్‌ గెలిచిన ముంబై...
10-11-2020
Nov 10, 2020, 18:24 IST
కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన క్రికెట్‌ అభిమానులకు అసలైన మజా ఇస్తున్న ఐపీఎల్‌ చివరి దశకు చేరుకుంది. నేటి ఫైనల్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top