Singapore Squash Open 2023: సౌరవ్‌ పరాజయం | Singapore Squash Open: Saurav Ghosal, Ramit Tandon Knocked Out | Sakshi
Sakshi News home page

Singapore Squash Open 2023: సౌరవ్‌ పరాజయం

Nov 17 2023 9:35 AM | Updated on Nov 17 2023 9:35 AM

Singapore Squash Open: Saurav Ghosal, Ramit Tandon Knocked Out - Sakshi

న్యూఢిల్లీ: సింగపూర్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్క్వాష్‌ టోర్నమెంట్‌ నుంచి భారత స్టార్‌ సౌరవ్‌ ఘోషాల్‌ నిష్క్రమించాడు. సింగపూర్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సౌరవ్‌ 3–11, 7–11, 10–12తో నాలుగో సీడ్‌ ముస్తఫా అసల్‌ (ఈజిప్ట్‌) చేతిలో ఓడిపోయాడు. 

భారత్‌కే చెందిన మరో ప్లేయర్‌ రమిత్‌ టాండన్‌ 3–11, 2–11, 4–11తో రెండో సీడ్‌ డీగో ఇలియాస్‌ (పెరూ) చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సౌరవ్‌ 11–6, 7–11, 11–6, 11–5తో టాడీ హారిటి (అమెరికా)పై, రమిత్‌ 11–7, 12–10, 12–10తో రోరీ స్టీవర్ట్‌ (స్కాట్లాండ్‌)పై గెలుపొందారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement