Sikandar Raza's Fastest ODI Century Breaks Sean Williams Record In 2 Days Gap - Sakshi
Sakshi News home page

#SikandarRaza: జింబాబ్వే తరపున ఫాస్టెస్ట్‌ సెంచరీ.. రెండు రోజుల్లోనే చెరిపేసి

Published Wed, Jun 21 2023 9:28 AM

Sikandar-Raza Fastest ODI Century-Break Sean Williams Record-2-Days Gap - Sakshi

జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో సికందర్‌ రజా 54 బంతుల్లో ఆరు ఫోర్లు, 8 సిక్సర్లతో 102 పరుగులు నాటౌట్‌ సుడిగాలి శతకంతో మెరిశాడు.

కేవలం 54 బంతుల్లోనే భారీ శతకం బాదిన సికందర్ రాజా జింబాబ్వే తరపున వన్డే క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉండేది. జూన్ 18న నేపాల్‌పై విలియమ్స్ కేవలం 70 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఈ రికార్డును సికందర్ రాజా కేవలం రెండు రోజుల్లోనే చెరిపేసి కొత్త చరిత్ర సృష్టించాడు. కాగా 37 ఏళ్ల వయసులో శతకం బాదిన సికందర్‌ రజా.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ బాదిన పెద్ద వయస్కుడిగా క్రెయిగ్‌ ఎర్విన్‌తో కలిసి సంయుక్తంగా నిలిచాడు.

ఇక వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉంది. డివిలియర్స్‌ కేవలం 31 బంతుల్లోనే శతకం మార్క్‌ అందుకోగా.. ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ కోరె అండర్సన్‌ (36 బంతుల్లోనే శతకం), షాహిద్‌ అఫ్రిది 37 బంతుల్లో, జాస్‌ బట్లర్‌ 46 బంతుల్లో, సనత్‌ జయసూర్య 48 బంతుల్లో అందుకున్నారు. ఇక టీమిండియా తరపున విరాట్‌ కోహ్లి 52 బంతుల్లో సెంచరీ సాధించాడు.

చదవండి: చావుదెబ్బ కొట్టిన ఆసీస్‌.. రికార్డులు బద్దలైన వేళ

సికందర్‌ రజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. ఎదురులేని జింబాబ్వే

Advertisement
Advertisement