
లండన్‌లోని ఓవల్ మైదానం వేదిగా ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ కీలక మ్యాచ్‌లో ఆడేందుకు భారత్ తమ తుది జట్టులో మూడు మార్పులు చేసే అవకాశముంది. అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన అన్షుల్ కాంబోజ్ వేటు వేసేందుకు గంభీర్ అండ్‌కో సిద్దమైనట్లు తెలుస్తోంది.
అదేవిధంగా వర్క్‌లోడ్ లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గాయంతో ఐదో టెస్టుకు దూరమైన పంత్ స్దానంలో ధ్రువ్ జురెల్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. ఇక ఈ మ్యాచ్‌తో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నట్లు భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ హింట్ ఇచ్చాడు.
"ఆఖరి టెస్టు కోసం అర్ష్‌దీప్‌ను సిద్దంగా ఉండమని చెప్పాం. కానీ ఈ సాయంత్రం పిచ్‌ను పరిశీలించిన తర్వాత ప్లేయింగ్ ఎలెవన్‌పై నిర్ణయం తీసుకుంటాము" అని గిల్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. గిల్ వ్యాఖ్యలు బట్టి అర్ష్‌దీప్ భారత వైట్‌బాల్ జెర్సీలో కన్పించే ఛాన్స్ ఉంది.
పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉన్నందున ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించింది. ఈ క్రమంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కంటే అర్ష్‌దీప్ వైపే మెనెజ్‌మెంట్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ జట్టు ఒక్క ఫ్రంట్‌లైన్ స్పిన్నర్ లేకుండా ఆడుతోంది. మాకు మాత్రం జడేజా,వాషింగ్టన్‌లో రూపంలో ఇద్దు స్పిన్నర్లు ఉన్నారని గిల్ చెప్పుకొచ్చాడు. గిల్ వ్యాఖ్యలు బట్టి కుల్దీప్ బెంచ్‌కు పరిమితం కావడం దాదాపు ఖాయం.
కాగా అన్షుల్ కాంబోజ్ స్దానంలో అర్ష్‌దీప్, బుమ్రా స్ధానంలో ఆకాష్ దీప్ ఆడనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అయితే మాంచెస్టర్‌లో బంతితో విఫలమైన శార్ధూల్ ఠాకూర్‌ను తుది జట్టులో కొనసాగిస్తారా లేదా వేరే ఆటగాడికి ఛాన్స్ ఇస్తారా అన్నది వేచి చూడాలి.
స్టోక్స్ దూరం..
మరోవైపు ఆఖరి టెస్టు కోసం ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఆతిథ్య జట్టు ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ కీలక మ్యాచ్ నుంచి కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజం గాయంతో తప్పుకొన్నాడు. స్టోక్స్ స్దానంలో జాకబ్ బెతల్‌కు అవకాశమిచ్చారు.
అదేవిధంగా ఆర్చర్, కార్స్‌లకు విశ్రాంతినివ్వగా...గత టెస్టులో పూర్తిగా విఫలమైన స్పిన్నర్ డాసన్‌ను ముందే పక్కన పెట్టారు. వీరి ముగ్గురి స్ధానాల్లో అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్ జట్టులోకి వచ్చారు.
తుది జట్ల వివరాలు:
భారత్ (అంచనా): శుబ్‌మన్ గిల్ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, శార్దుల్ ఠాకూర్/ప్రసిధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్‌దీప్, సిరాజ్.
ఇంగ్లండ్: ఓలీ పోప్ (కెప్టెన్ ), జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెతెల్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్.
చదవండి: Asia Cup 2025: ఆసియాకప్-2025కు జస్ప్రీత్ బుమ్రా దూరం! అతడు కూడా?