#ShubmanGill: గిల్‌ సెంచరీ.. ఒకే సీజన్‌లో మూడు శతకాలు బాదిన యంగెస్ట్‌ క్రికెటర్‌గా

Shubman Gill-1st Indian-Batter-Hit 3-Centuries Single Season IPL History - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో శుబ్‌మన్‌ గిల్‌ మూడో సెంచరీతో మెరిశాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ శతకం మార్క్‌ సాధించాడు. 49 బంతుల్లో సెంచరీ సాధించిన గిల్‌ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇదే సీజన్‌లో లీగ్‌ దశలో రెండు సెంచరీలు బాదిన గిల్‌.. తాజాగా క్వాలిఫయర్‌-2లో మూడో శతకం సాధించాడు.


Photo: IPL Twitter

ఐపీఎల్‌ చరిత్రలో ఒకే సీజన్‌లో మూడు సెంచరీలు చేసిన రెండో భారత బ్యాటర్‌గా.. తొలి యంగెస్ట్‌ ప్లేయర్‌గా(23 ఏళ్ల 260 రోజులు) గిల్‌ రికార్డులకెక్కాడు. ఇంతకవరకు ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు బాదిన బట్లర్‌(ఐపీఎల్‌ 2022లో), కోహ్లి(2016లో) సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు. తాజాగా గిల్‌ మూడో సెంచరీ బాది రెండో స్థానంలో నిలిచాడు.


Photo: IPL Twitter

ఇ‍క ఒకే సీజన్లో రెండు సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి, గిల్‌, శిఖర్‌ ధావన్‌, షేన్‌ వాట్సన్‌, కేఎల్‌ రాహుల్‌ ఉన్నారు. తాజాగా గిల్‌ ఆ రికార్డును బద్దలు కొట్టి ఒకే సీజన్‌లో మూడు సెంచరీలు బాదిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇక గిల్‌ తాజా సెంచరీతో ఈ సీజన్‌లో శతకాల సంఖ్య 12కు చేరుకుంది.

చదవండి: అనుభవం ముందు పనికిరాలేదు.. తెలివైన బంతితో బోల్తా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top