Shreyas Iyer Joins Elite Club With Century On Test Debut - Sakshi
Sakshi News home page

Shreyas Iyer: దిగ్గజాల సరసన శ్రేయాస్‌ అయ్యర్‌.. 16వ ఆటగాడిగా

Nov 26 2021 2:56 PM | Updated on Nov 27 2021 3:25 PM

Shreyas Iyer Joins Elite Club With Century On Test Debut - Sakshi

Shreyas Iyer Joins Elite Club With Debut Test Century.. టీమిండియా ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌ డెబ్యూ టెస్టులోనే సెంచరీతో అదరగొట్టాడు. 157 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్న అయ్యర్‌ ఓవరాల్‌గా 105 పరుగులు చేసి ఔటయ్యాడు. అయ్యర్‌ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన అయ్యర్‌ గంగూలీ, మహ్మద్‌ అజారుద్దీన్‌, సెహ్వాగ్‌, లాలా అమర్‌నాథ్‌ లాంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. అంతేగాక శ్రేయాస్‌ అయ్యర్‌ పలు రికార్డులు సవరించాడు. అదేంటో ఒకసారి పరిశీలిద్దాం.

► టీమిండియా తరపున డెబ్యూ టెస్టులోనే సెంచరీ చేసిన 16వ ఆటగాడు
► డెబ్యూ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన 13వ ఆటగాడిగా అయ్యర్‌
► స్వదేశంలో తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన 10వ ఆటగాడు
► ఇక కాన్పూర్‌లో అరంగేట్రం టెస్టులో సెంచరీ చేసిన రెండో ఆటగాడు అయ్యర్‌.. ఇంతకముందు గుండప్ప విశ్వనాథ్‌ ఈ ఘనత అందుకున్నాడు.
► ఇటీవలి కాలంలో తొలి టెస్టులోనే సెంచరీ అందుకున్న వారిలో పృథ్వీ షా, రోహిత్‌ శర్మల తర్వాత మూడో ముంబై ఆటగాడిగా అయ్యర్‌ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement