మళ్లీ ఓడిన గుజరాత్‌  | Second win for UP Warriors | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన గుజరాత్‌ 

Mar 2 2024 1:38 AM | Updated on Mar 2 2024 1:38 AM

Second win for UP Warriors - Sakshi

యూపీ వారియర్స్‌కు రెండో విజయం

రాణించిన సోఫీ, గ్రేస్‌ హారిస్‌ 

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీలో గుజరాత్‌ జెయింట్స్‌ జట్టుకు ‘హ్యాట్రిక్‌’ ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలిచి తమ ఖాతాలో రెండో విజయం నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు సాధించింది.

ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్‌), యాష్లే గార్డ్‌నర్‌ (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడటంతో గుజరాత్‌ స్కోరు 100 దాటింది. అంతకుముందు లారా వొల్వార్ట్‌ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు), కెప్టెన్‌ బెత్‌ మూనీ (16 బంతుల్లో 16; 2 ఫోర్లు), హర్లీన్‌ డియోల్‌ (24 బంతుల్లో 18; 1 ఫోర్‌) వేగంగా ఆడటంలో విఫలమయ్యారు. యూపీ స్పిన్నర్‌ సోఫీ ఎకిల్‌స్టోన్‌ 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.

అనంతరం యూపీ వారియర్స్‌ 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గ్రేస్‌ హారిస్‌ (33 బంతుల్లో 60 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి యూపీ విజయంలో కీలకపాత్ర పోషించింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ముంబై ఇండియన్స్‌ తలపడుతుంది.   

Advertisement
 
Advertisement
Advertisement