ఇండోనేసియా మాస్టర్స్‌ టోర్నీకి సాత్విక్ జోడీ దూరం | Satwik Jodi away from Indonesia Masters tournament | Sakshi
Sakshi News home page

ఇండోనేసియా మాస్టర్స్‌ టోర్నీకి సాత్విక్ జోడీ దూరం

Jan 23 2024 4:20 AM | Updated on Jan 23 2024 4:20 AM

Satwik Jodi away from Indonesia Masters tournament - Sakshi

జకార్తాలో నేటి నుంచి జరిగే ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ నుంచి సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ వైదొలిగింది. ఈ టోర్నీలో సాత్విక్ –చిరాగ్‌లకు టాప్‌ సీడింగ్‌ దక్కింది.

ఈ నెలలో ఆడిన రెండు టోర్నీల్లోనూ (మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్‌) సాత్విక్ –చిరాగ్‌ జంట రన్నరప్‌గా నిలిచింది. ఇండోనేసియా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు ప్రణయ్, శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్‌ బరిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement