గ్రూప్‌ ‘టాపర్‌’గా సాత్విక్‌–చిరాగ్‌ జోడీ | Satwik and Chirag pair as group topper | Sakshi
Sakshi News home page

గ్రూప్‌ ‘టాపర్‌’గా సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Jul 31 2024 4:15 AM | Updated on Jul 31 2024 4:15 AM

Satwik and Chirag pair as group topper

భారీ అంచనాలతో విశ్వక్రీడల బరిలోకి దిగిన  సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట.. అందుకు తగ్గట్లే వరుస విజయాలతో గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది. బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ గ్రూప్‌ ‘సి’మ్యాచ్‌లో మూడో సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 38 నిమిషాల్లో 21–13, 21–13తో ఫజర్‌–రియాన్‌ (ఇండోనేసియా) జంటపై విజయం సాధించింది. ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్న ఈ రెండు జోడీలు గ్రూప్‌ విజేత స్థానం కోసం పోటీపడ్డాయి. 

గ్రూప్‌ దశలో మిగిలిన మ్యాచ్‌లు ముగిసిన అనంతరం బుధవారం క్వార్టర్‌ ఫైనల్‌ ‘డ్రా’ విడుదల కానుంది. ఇక మహిళల డబుల్స్‌ గ్రూప్‌ ‘సి’లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జంట వరుసగా మూడో పరాజయంతో ఒలింపిక్స్‌ నుంచి విజయం లేకుండానే ని్రష్కమించింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో అశి్వని–తనీషా జంట 15–21, 10–21 తో మాపసా–ఏంజెలా (ఆస్ట్రేలియా) జోడీ చేతిలో ఓడింది. కాగా, ఇవే తన చివరి ఒలింపిక్‌ క్రీడలని 34 ఏళ్ల అశ్విని పొన్నప్ప ప్రకటించింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement